iDreamPost
android-app
ios-app

ప్రియుడి కోసం పాక్ వెళ్లిన అంజూ గుర్తుందా..? ఇండియా రిటర్న్స్.. ఎందుకంటే..?

ఇటీవల సరిహద్దు ప్రేమలు ఎక్కువయ్యాయి. పబ్జీ లవ్ గుర్తుందిగా. యుపి సచిన్ కోసం పాక్ సీమా హైదరి.. పిల్లలతో సహా ఇండియాకు వచ్చేసింది. అంతలో మరో సంఘటన.. ఫేస్ బుక్ ప్రేమికుడి కోసం అంజూ.. దాయాది దేశం వెళ్లిన సంగతి విదితమే. అయితే..

ఇటీవల సరిహద్దు ప్రేమలు ఎక్కువయ్యాయి. పబ్జీ లవ్ గుర్తుందిగా. యుపి సచిన్ కోసం పాక్ సీమా హైదరి.. పిల్లలతో సహా ఇండియాకు వచ్చేసింది. అంతలో మరో సంఘటన.. ఫేస్ బుక్ ప్రేమికుడి కోసం అంజూ.. దాయాది దేశం వెళ్లిన సంగతి విదితమే. అయితే..

ప్రియుడి కోసం పాక్ వెళ్లిన అంజూ గుర్తుందా..? ఇండియా రిటర్న్స్.. ఎందుకంటే..?

సోషల్ మీడియా, ఆన్ లైన్ గేమ్స్ ప్రేమలు ఈ మధ్య కాలంలో రచ్చరచ్చ చేశాయి. పబ్జీలో పరిచమైన సచిన్ ప్రేమ కోసం పొరుగు దేశం పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదరీ.. తన పిల్లలతో సహా ఉత్తరప్రదేశ్ వచ్చేసింది. సచిన్ మనస్సులో చొరబడటమే కాదూ.. దేశంలోకి కూడా అక్రమంగా వచ్చి.. అతడ్ని పెళ్లి చేసుకుంది. ఈ ఘటన పెను సంచలనమైన సంగతి విదితమే. ఇక్కడే ఉండిపోతానని తిష్ట వేసుకుంది. ఈ ప్రేమను ఆదర్శంగా తీసుకుని మరో లవ్ కపుల్ కలిపోయారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ నుండి మహిళ వచ్చేస్తే.. భారత్ నుండి పాక్ వెళ్లిపోయింది అంజూ. ఫేస్ బుక్‌లో పరిచయమైన ప్రియుడి కోసం ఈ ఇల్లాలు కూడా భర్త పిల్లల్ని వదిలేసి ఫ్లైట్ ఎక్కేసిన విషయం అందరికీ గుర్తు ఉండి ఉంటుంది.

ఇప్పుడు ఈ ఘటనలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చేసింది అంజూ. తాజాగా వాఘా సరిహద్దుల్ని దాటి భారత్‌లోకి వచ్చింది. స్వయంగా పాక్ భర్త నస్రుల్లా ఆమెను భారత్ సరిహద్దుల వరకు సాగనంపాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన అంజూకు పెళ్లై 15 ఏళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. కానీ సోషల్ మీడియా ఈమె కాపురంలో చిచ్చు పెట్టింది. 2019లో తన కన్నా ఐదేళ్ల చిన్నవాడైన నస్రుల్లాతో ఫేస్ బుక్ పరిచయం ఏర్పడింది అంజూకు. అలా వీరి మధ్య ప్రేమ చిగురించింది. అతడి కోసం దేశం దాటి వెళ్లింది. తొలుత పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పినప్పటికీ.. అనూహ్యంగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇండియా నుండి వచ్చిన ఆ యువతికి అక్కడి వారు ఖరీదైన బహుమతులు ఇచ్చారు.

ఈ క్రమంలో ఆమె మరో పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయారు భర్త, కుటుంబ సభ్యులు. ఆమెతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే తాను తిరిగి భారత్ వచ్చేస్తానని చెప్పింది ఫాతిమాగా మారిన అంజూ. అన్నట్లుగానే తాజాగా ఇండియా బయలు దేరింది. వాఘా సరిహద్దు వద్ద ఆమెను వదిలిపెట్టాడు పాక్ భర్త నస్రుల్లా. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమెను మీడియా పలకరించగా.. తాను సంతోషంగా ఉన్నానని, చెప్పేందుకు ఏమీ లేదంటూ పేర్కొంది. తన పిల్లల కోసం భారత్‌కు వచ్చానని చెబుతోంది. మరీ ఆమె చేసిన పనితో తీవ్ర ఇబ్బందులకు గురైన ఇండియా భర్త, వారి కుటుంబ సభ్యులు అంజూను స్వీకరిస్తారో లేదో తెలియాల్సి ఉంది. ఆమె తిరిగి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis