iDreamPost

Real Star Srihari : విలన్ శ్రీహరిని హీరోని చేసిన సూపర్ హిట్ – Nostalgia

Real Star Srihari : విలన్ శ్రీహరిని హీరోని చేసిన సూపర్ హిట్ – Nostalgia

కెరీర్ ప్రారంభంలో సైడ్ ఆర్టిస్ట్ గా విలన్ గా చేసినవాళ్లు తర్వాతి కాలంలో హీరోలుగా స్టార్లుగా ఎదగడం చూసాం. కానీ కొందరిది మాత్రం స్ఫూర్తివంతంగా ఉంటుంది. అందులో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. దాసరి నారాయణరావు బ్రహ్మనాయుడులో చిన్న వేషంతో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీహరి మొదట్లో ముక్కుమొహం తెలియని పాత్రలు చాలా చేశారు. టూ టౌన్ రౌడీలో వెంకటేష్ గ్యాంగ్ లో చాలా సేపు ఉన్నా కూడా అసలు గుర్తుపట్టలేనంతగా గుంపులో కలిసి పోయారంటే మళ్ళీ సినిమా చూస్తే కానీ క్యాచ్ చేయలేం. చిరంజీవి ముఠామేస్త్రి లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించినా ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు వచ్చేలా చేసింది మాత్రం సోలో హీరోగా చేసిన మాస్ సినిమాలే.

అందులో మొదటిది పోలీస్. ప్రేమించుకుందాం రాలో విలన్ గా, బావగారు బాగున్నారాలో కమెడియన్ గా, ప్రేమకు వేళాయెరాలో అమాయకుడుగా ఇలా ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో సులభంగా ఒదిగిపోతున్న శ్రీహరిలో హీరోని మొదటిసారి గుర్తించింది దర్శకుడు కం రచయిత కెఎస్ నాగేశ్వరరావు. ప్రోత్సహించింది నిర్మాత కె మహేంద్ర. సరైన కథలో చూపితే ఇతన్ని ప్రేక్షకులు హీరోగా ఆదరిస్తారని గుర్తించి తయారు చేసుకున్న కథే పోలీస్. అప్పటికి ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చినా మాస్ కు నచ్చే అన్ని అంశాలతో మాటల రచయిత దాసం వెంకటరావుతో కల్సి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. ప్రకటన విన్నప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు.

సీరియల్ ఆర్టిస్ట్ అశ్విని హీరోకు భార్యగా, సాహస ఘట్టం ఫేమ్ అరుణ్ పాండియన్ మరో కీలక పాత్రలో నటించగా రామిరెడ్డి, సూర్య, కాస్ట్యూమ్ కృష్ణ, ఎంఎస్ నారాయణ, రంగనాథ్, జీవా, వినోద్, గుండు హనుమంతరావు లాంటి మంచి క్వాలిటీ క్యాస్టింగ్ ని సెట్ చేసుకున్నారు. పాటలకు ప్రాధాన్యం లేకపోయినా వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించేందుకు ఒప్పుకున్నారు. కమర్షియల్ హీరోలను అప్పటికే చాలాసార్లు ఖాకీ దుస్తుల్లో చూసిన ఆడియన్స్ కి శ్రీహరి కొత్తగా పవర్ ఫుల్ గా కనిపించాడు. చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన పోలీస్ 1999 ఫిబ్రవరి 19న విడుదలైన సూపర్ హిట్ అందుకుని బయ్యర్లకు విపరీత లాభాలను ఇచ్చింది. ఇదే కాంబోలో తర్వాత వచ్చిన దేవా, సాంబయ్య కూడా అంతే సక్సెస్ కావడంతో శ్రీహరికి రియల్ స్టార్ బిరుదు రావడానికి అట్టే సమయం పట్టలేదు. దెబ్బకు మీడియం బడ్జెట్ నిర్మాతలంతా శ్రీహరితో సినిమాలు చేసేందుకు పోటీ పడటం జ్ఞాపకం కాదు చరిత్ర

Also Read : Taathamma Kala : రెండు నెలలు నిషేధానికి గురైన NTR సినిమా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి