iDreamPost

హైదరాబాదీలు జాగ్రత్త!.. మీరు ఆ పాలను తాగుతున్నారా?

సమాజంలో కల్తీ బెడద జనాలను ఆందోళనకు గురిచేస్తోంది. తినే తిండి, తాగే నీరు, ఇలా అన్ని కలుషితమై పోతున్నాయి. అఖరికి స్వఛ్చమైన పాలను కూడా డబ్బుకు ఆశపడి కల్తీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.

సమాజంలో కల్తీ బెడద జనాలను ఆందోళనకు గురిచేస్తోంది. తినే తిండి, తాగే నీరు, ఇలా అన్ని కలుషితమై పోతున్నాయి. అఖరికి స్వఛ్చమైన పాలను కూడా డబ్బుకు ఆశపడి కల్తీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.

హైదరాబాదీలు జాగ్రత్త!.. మీరు ఆ పాలను తాగుతున్నారా?

ప్రస్తుత కాలంలో మనం తినే ఆహార పదార్థాల నుంచి తాగే నీరు వరకు ప్రతీది కల్తీగా మారడం పెద్ద సమస్యగా మారింది. వేలకు వేలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినా ప్రయోజనం లేదు. ఏదీ నాణ్యమైనాదో, ఏదీ కల్తీ అనేది తెలియకుండా ఉంటుంది. రోజు రోజుకి ఈ కల్తీ చేసే వారి కక్కుర్తికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా పాలు కల్తీ చేయడం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. అయితే కల్తీపాల వ్యాపారాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు అందరూ పాలు తాగుతారు. అయితే ఈ పాలు కల్తీ అవ్వడం అనేది కొత్త విషయమేమి కాదు. ఇప్పటికే చాలాసార్లు ఈ పాల కల్తీదారుల గురించి వినే ఉంటాం. తాజాగా మరోమారు కొందరు కేటుగాళ్లు పాలను కల్తీ చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రతిరోజు పాలు తాగితే ఆరోగ్యనికి చాలా మంచింది. ఎందుకంటే పాలల్లో పోషకాలనేవి ఎక్కువగా లభిస్తాయి. మరి అటువంటి పాలను చాలామంది కల్తీ చేస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇటివలే యాదాద్రి భువనగిరి జోన్‌ లో ఎస్‌ఓటీ పోలీసుల నిర్వహించిన దాడుల్లో.. దాదాపు 13 చోట్ల అక్రమాలు బయట పడ్డాయి. అసలు యాదాద్రి జిల్లా అంటేనే పాడి పరిశ్రమకు మారు పేరు. ఈ జిల్లాలో వేలాది కుటుంబాలు పాల ఉత్పత్తి పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇది హైదరాబాద్ కు అతి సమీపాన ఉండడంతో నిత్యం లక్షలాది లీటర్ల పాలు నగరానికి ఎగుమతి అవుతున్నాయి. దీనినే అసరాగా తీసుకున్న కొందరు మోసగాళ్లు. స్వచ్ఛమైన పాలను కాస్తా కల్తీ పాలుగా మార్చి రవాణా చేస్తున్నారు. దురాశతో కూడిన వీరి అక్రమాలకు ముగింపు లేకుండా పోతుంది. పలు జిల్లాలో విచ్చలవిడిగా ఈ కల్తీపాల తయారీ అనేది జరుగుతోంది.

ముఖ్యంగా.. బొమ్మలరామారం, బీబీనగర్‌, భువనగిరి, భూదాన్‌ పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల్లో ఈ దందా అనేది ఎక్కువగా కొనసాగుతోంది. ఆరోగ్యాన్ని ఇచ్చే పాలను విషంగా మారుస్తున్నారు. అప్రమత్తమైన ప్రభుత్వం కల్తి పాల తయారీ పై నిఘా పెట్టింది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్‌, యాదాద్రి భువనగిరి జోన్‌ ఎస్‌ఓటీ పోలీసుల తనీఖీలు నిర్వహించారు. గతంలో అనేక సార్లు పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్‌ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయినా ఈ కల్తీ కేటుగాళ్లు ఇప్పటికి మారడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా పెద్ద ఎత్తున ఈ కల్తీ పాలను హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు. మరి యాదాద్రిలో కల్తీ పాల అక్రమాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి