iDreamPost

T20 వరల్డ్ కప్​లో కోహ్లీ ఆడడా? ఒక్క డైలాగ్​తో వాళ్లకు ఇచ్చిపడేసిన కింగ్!

  • Published Mar 26, 2024 | 10:52 AMUpdated Mar 26, 2024 | 10:52 AM

ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. పంజాబ్​ కింగ్స్​తో మ్యాచ్​లో సూపర్బ్ నాక్​తో చెలరేగిపోయాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కింగ్.. టీ20 వరల్డ్ కప్​లో ఆడటంపై క్లారిటీ ఇచ్చేశాడు.

ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. పంజాబ్​ కింగ్స్​తో మ్యాచ్​లో సూపర్బ్ నాక్​తో చెలరేగిపోయాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కింగ్.. టీ20 వరల్డ్ కప్​లో ఆడటంపై క్లారిటీ ఇచ్చేశాడు.

  • Published Mar 26, 2024 | 10:52 AMUpdated Mar 26, 2024 | 10:52 AM
T20 వరల్డ్ కప్​లో కోహ్లీ ఆడడా? ఒక్క డైలాగ్​తో వాళ్లకు ఇచ్చిపడేసిన కింగ్!

టీమిండియా డాషింగ్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ కొన్నాళ్లుగా క్రికెట్​కు దూరంగా ఉంటూ వచ్చాడు. భార్య అనుష్క శర్మకు డెలివరీ అవడంతో లండన్​లో ఉండిపోయిన కింగ్.. ఐపీఎల్-2024 కోసం స్వదేశానికి తిరిగొచ్చాడు. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్​లో మంచి ఊపు మీద ఉన్నాడు కింగ్. సీఎస్​కేతో జరిగిన తొలి మ్యాచ్​లో ఫర్వాలేదనిపించిన విరాట్.. పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో మాత్రం చెలరేగిపోయాడు. పరుగులు చేయాలనే కసి మీద ఉన్న రన్ మెషీన్ 49 బంతుల్లో 77 రన్స్ చేశాడు. 11 బౌండరీలు బాదిన కోహ్లీ.. 2 భారీ సిక్సులు కొట్టాడు. అతడితో పాటు దినేష్ కార్తీక్ (10 బంతుల్లో 28 నాటౌట్) మెరుపు బ్యాటింగ్​తో అలరించడంతో ఆర్సీబీ ఈ మ్యాచ్​లో 4 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ సీజన్​లో బెంగళూరుకు ఇదే తొలి విజయం. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచిన విరాట్.. మ్యాచ్ అనంతరం షాకింగ్ కామెంట్స్ చేశాడు.

టీ20 వరల్డ్ కప్​కు కోహ్లీ దూరం అంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న కరీబియన్ దీవుల్లో విరాట్​కు మంచి స్ట్రైక్ రేట్ లేదని.. అతడి ప్లేసులో యంగ్​స్టర్స్​ను టీమ్​లోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. స్వయంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయాన్ని కింగ్​తో డిస్కస్ చేయనున్నట్లు టాక్ వచ్చింది. ఈ గాసిప్స్ కోహ్లీ వరకు చేరినట్లు ఉన్నాయి. అందుకే పంజాబ్​తో మ్యాచ్ తర్వాత దీని మీద రియాక్ట్ అయ్యాడు విరాట్. జట్టులో తనకు చోటు లేదంటూ విమర్శించిన వారికి ఓ రేంజ్​లో కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికీ వరల్డ్​వైడ్​గా టీ20 క్రికెట్​ను ప్రమోట్ చేసేందుకు తన పేరునే వాడుకుంటున్నారని తెలిపాడు. పొట్టి ఫార్మాట్ మీద తాను ఇంకా పట్టు కోల్పోలేదని చెప్పకనే చెప్పాడు. టీ20 ప్రపంచ కప్​లో ఆడటం పక్కా అని క్లారిటీ ఇచ్చాడు.

My name is being used

‘ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్​ను ప్రమోట్ చేసేందుకు నా పేరును మాత్రమే వాడుకుంటున్నారని నాకు తెలుసు. నాలో ఇంకా ఆట మిగిలే ఉంది. ఎప్పుడూ బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. అయితే వికెట్లు పడితే మాత్రం సిచ్యువేషన్​ను అంచనా వేసి ఆడాల్సి ఉంటుంది. గేమ్​ను ఫినిష్ చేయనందుకు నిరాశగా ఉంది. ఇది నార్మల్ ఫ్లాట్ పిచ్ కాదు. నేను కవర్ డ్రైవ్ బాగా ఆడతానని అందరికీ తెలుసు. అందుకే గ్యాప్​లో బాల్​ను తరలించకుండా నన్ను ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో ఎప్పటికప్పుడు నా స్ట్రాటజీని మార్చాల్సి వచ్చింది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. విరాట్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. తాను లేకుండా భారత టీమ్ వరల్డ్ కప్​కు వెళ్లదని కోహ్లీ చెప్పకనే చెప్పేశాడని అంటున్నారు. ప్రపంచ క్రికెట్​కే తాను బ్రాండ్ అంబాసిడర్​నని.. తనకే టీమ్​లో చోటు లేదని ఎలా అంటారని క్రిటిక్స్​కు విరాట్ ఇన్​డైరెక్ట్ కౌంటర్ వేశాడని చెబుతున్నారు. మరి.. కోహ్లీని టీ20 ప్రపంచ కప్​లో చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Hardik Pandya: నువ్వేమైనా ధోనివా? పాండ్యా పరువుతీసిన మహ్మద్ షమీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి