iDreamPost
android-app
ios-app

స్ట్రెక్చర్ పై నుండి.. నేరుగా మెరుపు బౌలింగ్ వరకు! ఇది కదా పట్టుదల అంటే!

Mustafizur Rahman: ఐపీఎల్ 2024 సీజన్ షురూ అయిపోయింది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ- చెన్నై అద్భుతమైన పోరాటం చూశారు. అయితే ఆర్సీబీ జట్టు అద్భుతమైన స్కోర్ చేయాల్సి ఉండగా.. ఒక్కడు అడ్డు పడిపోయాడు.

Mustafizur Rahman: ఐపీఎల్ 2024 సీజన్ షురూ అయిపోయింది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ- చెన్నై అద్భుతమైన పోరాటం చూశారు. అయితే ఆర్సీబీ జట్టు అద్భుతమైన స్కోర్ చేయాల్సి ఉండగా.. ఒక్కడు అడ్డు పడిపోయాడు.

స్ట్రెక్చర్ పై నుండి.. నేరుగా మెరుపు బౌలింగ్ వరకు! ఇది కదా పట్టుదల అంటే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. ప్రారంభ వేడుకల కోసం మాత్రమే కాకుండా.. చెన్నై- ఆర్సీబీ మ్యాచ్ కోసం అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ మ్యాచ్ కోసం ఐపీఎల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఎందుకంటే ఇది తొలి మ్యాచ్ మాత్రమే కాకుండా.. చెన్నై- ఆర్సీబీ పోరాటం చూడాలి అనుకున్నారు. ఆడియన్స్ ఎదురుచూసిన విధంగానే తొలి మ్యాచ్ అదిరిపోయిందనే చెప్పాలి. బౌలింగ్ తో చెన్నై.. బ్యాటింగ్ తో ఆర్సీబీ జట్లు ఇరగదీశాయి. టీమ్ తో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్ ని తెగ పొగిడేస్తున్నారు.

చెన్నై వేదికగా ఆర్సీబీ- చెన్నై మ్యాచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో చాలానే అద్భుతాలు జరిగాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టు తొలి బాల్ నుంచి ఫుల్ అటాకింగ్ లోకి వెళ్లిపోయింది. ఫాఫ్ డుప్లెసిస్ 35 పరుగులతో చెలరేగాడు. ఈ దూకుడు చూస్తే ఆర్సీబీ జట్టు సునాయాసంగా 200 పరుగులు చేస్తుంది అనుకున్నారు. కానీ, ఒకే ఒక్కడు ఆర్సీబీకి అడ్డం పడిపోయాడు. అతనే బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్. ఓవర్ కు రెండు వికెట్లు చొప్పున నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీకి అడ్డుకట్ట వేయడంలో అతను కీలకపాత్ర పోషించాడు.

Shaking RCB today

డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, కామెరూన్ గ్రీన్ వంటి దిగ్గజాలను పెవిలియన్ చేర్చి ఆర్సీబీని కట్టడి చేశాడు. తీసిన నాలుగు వికెట్లకే అంత ఎలివేషన్ ఎందుకు అనుకోవచ్చు. కానీ, అతను సరిగ్గా నాలుగు రోజుల క్రితం అతను స్ట్రెచర్ మీద ఉన్నాడు. ఇప్పుడు మైదానంలో బంతితో అద్భుతాలు చేస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో ముస్తాఫిజుర్ కండరాలు పట్టేసి మైదానంలోనే కుప్పకూలాడు. కాసేపటి తర్వాత మైదానంలోకి వచ్చి బౌలింగ్ వేసే ప్రయత్నం చేసినా కూడా.. ఒక్క బాల్ కూడా వేయకుండా వెనుదిరిగాడు. అతడిని స్ట్రెచర్ మీద ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.

అందరూ సీఎస్కేకి ఎదురుదెబ్బ.. ముస్తాఫిజుర్ రహ్మాన్ ఐపీఎల్ కి దూరమయ్యాడు అనుకున్నారు. దాదాపుగా అదే ఫిక్స్ అయిపోయారు. కానీ, ముస్తాఫిజుర్ అందరిని షాక్ కి గురిచేస్తూ.. తొలి మ్యాచ్ లోకి వచ్చేశాడు. రావడం మాత్రమే కాకుండా.. తనదైన స్టైల్ లో బాల్ తో మ్యాజిక్ చేశాడు. ఇలాంటి ఒక ప్లేయర్ ని చాలా అరుదుగా చూస్తాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్ట్రెచర్ మీద నుంచి ఆర్సీబీని వణికించే వరకు అంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. కార్తిక్- రావత్ జోడీ ఆర్సీబీకి గౌరవప్రదమైన స్కోర్ ని అందించింది. రావత్(48), ధినేష్ కార్తిక్(38) పరుగులతో అదరగొట్టారు. 70 పరుగులకే ఆలౌట్ అవుతారు అనుకునే స్థాయి నుంచి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. మరి.. ఆర్సీబీపై చలరేగిన ముస్తాఫిజుర్ రహ్మాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.