iDreamPost
android-app
ios-app

RCB చుట్టూ మొత్తం IPL..! ఇది ముంబైకి, చెన్నైకి కూడా అందని రేంజ్!

  • Published May 14, 2024 | 1:28 PM Updated Updated May 14, 2024 | 1:28 PM

RCB Vs CSK, IPL 2024: క్రికెట్‌ అభిమానులు ఓ టీమ్‌ గురించే చర్చించుకుంటున్నారు. ఆ టీమ్‌ ఆడినా.. వేరే టీమ్స్‌ ఆడినా.. అందరి ఫోకస్‌ మాత్రం దానిపైనే ఉంది. ఆర్సీబీ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది.

RCB Vs CSK, IPL 2024: క్రికెట్‌ అభిమానులు ఓ టీమ్‌ గురించే చర్చించుకుంటున్నారు. ఆ టీమ్‌ ఆడినా.. వేరే టీమ్స్‌ ఆడినా.. అందరి ఫోకస్‌ మాత్రం దానిపైనే ఉంది. ఆర్సీబీ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది.

  • Published May 14, 2024 | 1:28 PMUpdated May 14, 2024 | 1:28 PM
RCB చుట్టూ మొత్తం IPL..! ఇది ముంబైకి, చెన్నైకి కూడా అందని రేంజ్!

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభంలో ఆర్సీబీ ఎలాంటి చెత్త ప్రదర్శన కనబర్చిందో చూశాం. చెత్త బౌలింగ్‌తో తొలి 8 మ్యాచ్‌ల్లో ఏకంగా 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దాంతో.. ఈ సీజన్‌లో కూడా ఆర్సీబీ ‘ఈ సాలా కప్‌ నమ్‌దే’ నినాదం నవ్వుల పాలైనట్లే అని క్రికెట్‌ అభిమానులు భావించారు. కానీ, 9వ మ్యాచ్‌ నుంచి ఆర్సీబీ నెక్ట్స్‌ లెవెల్‌ టీమ్‌లా ఆడుతోంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి.. ఈ సీజన్‌లో కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఏ మ్యాచ్‌ జరిగినా.. ఆర్సీబీ గురించే చర్చ జరుగుతోంది. ఇక ఆర్సీబీ ఆడే మ్యాచ్‌ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్‌ అభిమానులు ఎగబడి చూస్తున్నారు.

గతంలో ఈ క్రికెట్‌ టీమ్‌కు కూడా ఈ రేంజ్‌ ఫాలోయింగ్‌ రాలేదని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. ఐదేసి సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు కూడా ఇలాంటి క్రేజ్‌ ఎప్పుడూ లేదని, ఆడే ప్రతి మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లోపం అంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడటం ఇదే తొలి సారి అని అంటున్నారు. ఓ జట్టు తొలి 8 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనప్పుటికీ ఈ రేంజ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఆర్సీబీ ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ వస్తుంటే.. ఏదో ఒక టీమ్‌పై ప్రభావం పడుతోంది.

సులభంగా ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందనుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ లాంటి హేమాహేమీ టీమ్‌ కూడా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది అంటే.. అది ఆర్సీబీ సృష్టించిన విధ్వంసం వల్లే. అలాగే ఆర్సీబీ కంటే.. ముందే చాలా మ్యాచ్‌లు గెలిచి ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ లాంటి జట్లు ఇప్పుడు ప్రతి మ్యాచ్‌లో చెమట చిందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్సీబీ చేస్తున్న పోరాటంతో.. ప్రతి మ్యాచ్‌లో అన్ని జట్లు ప్రాణం పెట్టి ఆడుతున్నాయి. టేబుల్‌ టాపర్స్‌గా ఉన్న కేకేఆర్‌, ఆర్‌ఆర్‌ టీమ్స్‌ గురించి కూడా ఎవరు మాట్లాడటం లేదు. పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ ఊసే ఎవరూ ఎత్తడం లేదు. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్న ఆర్సీబీ గురించే చర్చ. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఆర్సీబీ కనుక ప్లే ఆఫ్స్‌కు వెళ్తే.. క్రికెట్‌ అభిమానులు మరింత ఆసక్తి చూపించే అవకాశం ఉంది. మరి ఈ ఆర్సీబీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.