iDreamPost

ప్లే ఆఫ్స్ లోకి RCB.. కానీ, ఫ్యాన్స్ ని భయపెడుతున్న ఆ సెంటిమెంట్!

RCB Into Playoffs- Fans Fear On Sentiment: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆర్సీబీ జట్టు మహా అద్భుతం చేసింది. వరుసగా 6 మ్యాచుల్లో విజయం సాధించి ఏకంగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఒక సెంటిమెంట్ విషయంలో బాగా కంగారు పడుతున్నారు.

RCB Into Playoffs- Fans Fear On Sentiment: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆర్సీబీ జట్టు మహా అద్భుతం చేసింది. వరుసగా 6 మ్యాచుల్లో విజయం సాధించి ఏకంగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఒక సెంటిమెంట్ విషయంలో బాగా కంగారు పడుతున్నారు.

ప్లే ఆఫ్స్ లోకి RCB.. కానీ, ఫ్యాన్స్ ని భయపెడుతున్న ఆ సెంటిమెంట్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లోనే ఆర్సీబీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అస్సలు ఇలాంటి ఒక ప్రదర్శనను ఫ్యాన్స్ కూడా ఊహించలేదు. ఎందుకంటే సీజన్ మొదటి నుంచి మధ్య వరకు టేబుల్ లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు. కానీ, అనూహ్యంగా ప్లే ఆఫ్స్ లోకి వచ్చేసింది. ఇలాంటి ఒక ప్రదర్శనను క్రికెట్ దిగ్గజాలు కూడా ఊహించలేదు. మాజీలు, నిపుణులు కూడా ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టడం అసాధ్యం అంటూ భవిష్యత్ వివరించారు. కానీ, అందరి నోళ్లు మూయిస్తూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాయల్ గా ప్లే ఆఫ్స్ లోకి వచ్చేసింది. చెన్నై జట్టును చిత్తుగా ఓడించి ఈ విజయాన్ని నమోదు చేసింది. కానీ, ఆర్సీబీ ఫ్యాన్స్ లో మాత్రం ఒక కంగారు ఉండనే ఉంది.

ఐపీఎల్ చరిత్రలో చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన చెన్నై- ఆర్సీబీ మ్యాచ్ మాత్రం ఫైనల్ కి మించి క్రేజ్ ని సొంతం చేసుకుంది. జియో సినిమాలో ఏకంగా 50 కోట్ల వ్యూవర్ షిప్ దక్కింది. ఈ తరహా క్రేజ్, ఫాలోయింగ్, వ్యూవర్ షిప్ ఫైనల్ మ్యాచ్ కి కూడా ఊహించలేము. ఆర్సీబీ జట్టు ఎంతో పోరాడి ఈ సీజన్లో ఈ స్థాయికి వచ్చింది. తొలుత వరుసగా 6 మ్యాచుల్లో ఓటమి పాలైన బెంగళూరు జట్టు.. తర్వాత వరుసగా 6 మ్యాచుల్లో విజయం సాధించి ఏకంగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టేసింది. ఇప్పుడు ఫైనల్ కి వెళ్లడం.. కప్పు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ ఏడాది కప్పు కొట్టాలి అని గట్టిగా కోరుకుంటున్నారు.

ఈ సీజన్లో ఆర్సీబీ ప్రదర్శన చూస్తుంటే కప్పు కొట్టేలాగే కనిపిస్తోంది. కానీ, ఒక సెంటిమెంట్ మాత్రం అటు ఆర్సీబీని, ఇటు ఫ్యాన్స్ ని కంగారు పెడుతోంది. ఆ సెంటిమెంట్ గనుక రిపీట్ అయితే ఆర్సీబీ కప్పు కొట్టడం దాదాపుగా అసాధ్యం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేంటంటే.. గతంలో కూడా ఆర్సీబీ ఇలాగే వరుస మ్యాచుల్లో విజయం సాధించి అద్భుతంగా రాణించింది. ఆ సీజన్లలో ఎప్పుడూ ఆర్సీబీ కప్పు కొట్టలేకపోయింది. గతంలో 2009లో ఆర్సీబీ జట్టు వరుసగా 5 మ్యాచుల్లో గెలిచింది. కానీ, ఆ సీజన్లో ఆర్సీబీ జట్టు రన్నరప్ గానే మగిలిపోయింది. ఆ తర్వాత 2011 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా 7 మ్యాచుల్లో వరుస విజయాలు నమోదు చేసింది. కానీ, ఆ సీజన్లో కూడా రన్నరప్ గానే మగిలిపోయింది.

2016వ సీజన్లో కూడా ఆర్సీబీ జట్టు వరుసగా 5 మ్యాచుల్లో విజయం సాధించింది. ఆ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వచ్చి కప్పు కొట్టుకుపోయింది. ఇప్పుడు 2024వ సీజన్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా 6 మ్యాచుల్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో అని ఆర్సీబీ ఫ్యాన్స్ కాస్త కంగారుగా ఉన్నారు. పైగా ప్లే ఆఫ్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఉంది. అది కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ని కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఈసారి మాత్రం ఆర్సీబీ జట్టు ప్రదర్శనపై ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. పైగా ఉమెన్ టీమ్ తొలి టైటిల్ ని కొట్టింది. అలాగే డుప్లెసిస్ సేన కూడా తొలి కప్పు కొట్టి చరిత్ర సృష్టిస్తారని ఆకాంక్షిస్తున్నారు. ఈ సెంటిమెంట్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ మాజీలు కూడా చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి