iDreamPost
android-app
ios-app

మ్యాచ్ గెలిచాక RCB ఫ్యాన్స్ వరెస్ట్ బిహేవియర్! ఆలస్యంగా వీడియో వైరల్!

  • Published May 20, 2024 | 12:59 PM Updated Updated May 20, 2024 | 1:17 PM

RCB vs CSK, IPL 2024: ఐపీఎల్‌లో అన్ని టీమ్స్‌ కంటే ఆర్సీబీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. అయితే అదే ఆ టీమ్‌కు కొన్ని సార్లు మైనస్‌ అవుతోంది. వారి చేష్టలతో ఆర్సీబీకి బ్యాడ్‌ నేమ్‌ కూడా వస్తోంది. తాజాగా ఆర్సీబీ ఫ్యాన్స్‌ బ్యాడ్‌ బిహేవియర్‌కు సంబంధించిన వీడియోలు బయటకి వస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

RCB vs CSK, IPL 2024: ఐపీఎల్‌లో అన్ని టీమ్స్‌ కంటే ఆర్సీబీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. అయితే అదే ఆ టీమ్‌కు కొన్ని సార్లు మైనస్‌ అవుతోంది. వారి చేష్టలతో ఆర్సీబీకి బ్యాడ్‌ నేమ్‌ కూడా వస్తోంది. తాజాగా ఆర్సీబీ ఫ్యాన్స్‌ బ్యాడ్‌ బిహేవియర్‌కు సంబంధించిన వీడియోలు బయటకి వస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 20, 2024 | 12:59 PMUpdated May 20, 2024 | 1:17 PM
మ్యాచ్ గెలిచాక RCB ఫ్యాన్స్ వరెస్ట్ బిహేవియర్! ఆలస్యంగా వీడియో వైరల్!

ఐపీఎల్‌ 2024 కీలక దశకు చేరుకుంది. లీగ్‌ మ్యాచ్‌లు ముగిసి.. మంగళవారం నుంచి ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నెల 18న ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఆర్సీబీ, సీఎస్‌కే మధ్య జరిగిన మ్యాచ్‌ ఈ సీజన్‌కే బెస్ట్‌ మ్యాచ్‌గా నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ, సీఎస్‌కే హోరాహోరీగా తలపడ్డాయి. కానీ, చివరికి ఆర్సీబీ విజయం సాధించడంతో పాటు.. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఎలాంటి ఈక్వేషన్‌తో గెలవాలో అలాంటి లెక్కలన్ని సరిచేస్తూ.. మ్యాచ్‌ గెలిచి.. సగర్వంగా ప్లే ఆఫ్స్‌కు చేరింది.

ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం తర్వాత.. క్రికెట్‌ అభిమానులంతా సంతోషం వ్యక్తం చేశారు. తొలి 8 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరిందంటే.. అది మామూలు విషయం కాదు. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత.. పుంజుకుని వరుసగా ఆరు అద్భుత విజయాలతో నాలుగో స్థానంలో ప్లే ఆఫ్స్‌కు చేరింది. అయితే.. సీఎస్‌కేతో మ్యాచ్‌ తర్వాత ఫుల్‌ హ్యాపీగా ఉన్న ఆర్సీబీ అభిమానులు కాస్త హద్దు మీరి ప్రవర్తించి.. చాలా అతి చేశాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌.. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. చిన్న స్వామి స్టేడియం అంటే.. ఆర్సీబీకి హోం గ్రౌండ్‌. అక్కడ ఆ టీమ్‌కు భారీ సపోర్ట్‌ లభిస్తుంది.

పైగా ప్లే ఆఫ్స్‌కు సీఎస్‌కే లాంటి బిగ్‌ టీమ్‌పై గెలవడంతో ఆర్సీబీ అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మ్యాచ్‌ పూర్తి అయిన తర్వాత.. స్టేడియం బయట సీఎస్‌కే సపోర్ట్స్‌ను అడ్డుకుంటూ.. వారిని ఎగతాళి చేస్తూ.. నానా హడావిడి చేశారు. వారి వరెస్ట్‌ బిహేవియర్‌కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసి.. కొంతమంది ఎంత మ్యాచ్‌ గెలిచినా ఇంత ఓవర్‌ యాక్షన్‌ చేయాలా అంటూ తిడుతున్నారు. అయితే.. గతంలో ఆర్సీబీ మ్యాచ్‌లు ఓడిపోయిన సమయంలో.. వారికి కప్పు రాదని, ఈ సాలా కప్‌ నమ్‌దే అంటూ ఆర్సీబీని, ఆర్సీబీ ఫ్యాన్స్‌ను కూడా ఇంతకంటే దారుణంగా ట్రోల్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో ఆర్సీబీ అభిమానులు కౌంటర్‌ ఇస్తున్నారు.  అయితే.. అదే వీడియోలో ఓటమితో బాధలో ఉన్న సీఎస్‌కే ఫ్యాన్స్‌ను ఆర్సీబీ అభిమానులు ఓదారుస్తున్న దృష్ట్యాలు కూడా ఉన్నాయి. కానీ, కొంత మంది చేసిన అతి మాత్రం విమర్శల పాలవుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.