iDreamPost

RBI: Paytmకి షాకిచ్చిన RBI! ఆ సేవలు నిలిపివేత.. పూర్తివివరాలు!

పేటీఎంపై ఆంక్షలు విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫిబ్రవరి 29 నుంచి పలు సేవలను నిలిపివేయనుంది. మరి నిలిపివేస్తున్న ఆ సేవలు ఏవి? కొనసాగించే సేవలు ఏవి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పేటీఎంపై ఆంక్షలు విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫిబ్రవరి 29 నుంచి పలు సేవలను నిలిపివేయనుంది. మరి నిలిపివేస్తున్న ఆ సేవలు ఏవి? కొనసాగించే సేవలు ఏవి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

RBI: Paytmకి షాకిచ్చిన RBI! ఆ సేవలు నిలిపివేత.. పూర్తివివరాలు!

Paytm.. డిజిటల్ యుగంలో ఈ పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. అంతలా బ్యాంకింగ్ రంగంపై తనదైన ముద్రవేసింది ఈ సంస్థ. అయితే ఇటీవల కాలంలో పెరిగిన పోటీతో నష్టాలు చవిచూస్తూ.. మార్కెట్ లో తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. ఇలాంటి కష్టకాలంలో పేటీఎంపై భారీ పిడుగువేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది ఆర్బీఐ. ఫిబ్రవరి 29 నుంచి పలు సేవలను నిలిపివేసింది. మరి నిలిపివేసిన ఆ సేవలు ఏవి? కొనసాగించే సేవలు ఏవి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పేటీఎంపై ఆంక్షలు విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో పేటీఎం ఖాతాదారుల ఆందోళనకు గురౌతున్నారు. కస్టమర్ల మనీ సేఫేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆర్బీఐ విధించిన ఆక్షల ద్వారా పేటీఎంలో రద్దైయ్యే సేవలు ఏవి? ఎలాంటి సేవలు ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా పేటీఎం ఫాస్టాగ్ లు ఫిబ్రవరి 29 నుంచి పనిచేయవు. దీంతో యూజర్లు అంతా ఎంత త్వరగా వీలైతే అంత ఫాస్ట్ గా ఇతర ఫాస్టాగ్ లను కొనుక్కోవడం మంచిది. దీంతో పాటుగా పేటీఎం వాలెట్ లో ఫిబ్రవరి 29 తరువాత ఖతాదారులు ఇందులో డబ్బులు జమచేయరాదు. పేటీఎం వాలెట్ అనేది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ పై ఆధారపడి పనిచేస్తుంది.

కాగా.. ఒక వేళ మీకు అవసరం అయితే ఇప్పటి వరకు పేటీఎంలో ఉన్న డబ్బులను మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలుంటుంది. ఇక చివరి తేదీ తర్వాత ఆర్థిక లావాదేవాలు కానీ.. టాప్ అప్ లు గానీ చేయలేరు. ప్రీపెయిడ్ సాధనాలు, ఫుడ్, ఫ్యూయెల్ కార్డులు, మెట్రోల్లో ఉపయోగించే కామెన్ మెుబిలిటీ కార్డులు కూడా వాడలేరు. ఫిబ్రవరి 29 వరకే తమ నిధులను వాడుకోవచ్చు. ఇక గడువు తేదీ తర్వాత యూపీఐ పేమెంట్స్ చేసుకోవడానికి వీలు పడదు. అయితే పేటీఎం లోన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడదని తెలిపింది. కొత్త డిపాజిట్లను స్వీకరించడం కానీ, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేపట్టకూడదని ఆర్బీఐ ఆదేశించింది. అయితే ఖాతాదారులు తమ నగదును విడుదల చేసుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే పేటీఎం రిఫండ్లు,క్యాష్ బ్యాక్స్, వడ్డీలపైన ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది. కాగా.. యూపీఐ పేమెంట్లపై ఎలాంటి ప్రభావం చూపదని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

ఇదికూడా చదవండి: Budget 2024: మధ్యంతర బడ్జెట్‌ ఎఫెక్ట్‌.. ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి