iDreamPost

బజాజ్‌ ఫైనాన్స్‌కు RBI భారీ షాక్‌.. ఆ లోన్లు ఇచ్చేందుకు వీల్లేదంటూ ఆదేశాలు

  • Published Nov 16, 2023 | 2:44 PMUpdated Nov 16, 2023 | 2:44 PM

నిబంధనలు పాటించని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మీద ఆర్బీఐ కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బజాజ్‌ ఫైనాన్స్‌కు షాకిచ్చింది. లోన్లు ఇచ్చేందుకు వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

నిబంధనలు పాటించని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మీద ఆర్బీఐ కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బజాజ్‌ ఫైనాన్స్‌కు షాకిచ్చింది. లోన్లు ఇచ్చేందుకు వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

  • Published Nov 16, 2023 | 2:44 PMUpdated Nov 16, 2023 | 2:44 PM
బజాజ్‌ ఫైనాన్స్‌కు RBI భారీ షాక్‌.. ఆ లోన్లు ఇచ్చేందుకు వీల్లేదంటూ ఆదేశాలు

బజాజ్‌ ఫైనాన్స్‌కు భారీ షాకిచ్చింది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌. ఆ సంస్థకు చెందిన రెండు రకాల రుణాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ గత కొంత కాలంగా పలు బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) లపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. లోన్లకు సంబంధించిన సరైన మార్గదర్శకాలు పాటించకపోవడం, బ్యాంకింగ్‌ నియమాలను ఉల్లంఘించడం వంటి వాటికి అడ్డుకట్ట వేయడం కోసం ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తోంది. అవసరమైతే లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక గత కొంత కాలంగా పలు కోపరేటీవ్‌ బ్యాంక్‌లపై కొరడా ఝుళిపించడమే కాక.. లైసెన్స్‌లు కూడా రద్దు చేసింది. దీనిలో భాగంగానే తాజాగా బజాజ్‌ ఫైనాన్స్‌కు భారీ షాక్‌ ఇచ్చింది ఆర్బీఐ.

బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన ఇ-కామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డులపై మంజూరు చేసే రుణాల జారీ నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ లోన్లకు సంబంధించిన మార్గదర్శకాల్ని పాటించకపోవడంతోనే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాక తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. బజాజ్ ఫైనాన్స్ అందిస్తోన్న ఈ రెండు లోన్‌లకు సంబంధించి.. రుణ గ్రహీతలకు వాస్తవ ప్రకటనల్ని జారీ చేయకపోవడాన్ని ఆర్‌బీఐ తప్పుబట్టింది. ఇవి రెండు మాత్రమే కాక కంపెనీ మంజూరు చేసిన ఇతర డిజిటల్ రుణాలకు సంబంధించిన ప్రకటనల్లో కూడా లోపాలు ఉన్నాయని ఆర్‌బీఐ పేర్కొంది.

తాము తెలియజేసిన లోపాలు సరిదిద్దిన తర్వాత సమీక్షించి.. ప్రస్తుతం విధించిన ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రుణ గ్రహీతల ప్రయోజనార్థం గత ఏడాది అనగా 2022, ఆగస్టులో ఆర్‌బీఐ కొన్ని మార్గదర్శకాల్ని జారీ చేసింది. వాటిని పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటుంది. ఇక తాజాగా ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీగా పతనమయ్యాయి.

కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ.. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కూడా భారీ మొత్తంలో జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అలానే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన మొబైల్ యాప్‌కు సంబంధించి కూడా ఆర్బీఐ పరిమితులు విధించింది. ఈ యాప్‌ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు వీల్లేదని స్పష్టం రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి