ప్రతిష్టాత్మక ఆసియా కప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. ఎదురొచ్చిన ప్రతి టీమ్‌ను ఓడిస్తూ దూసుకెళ్తోంది రోహిత్ సేన. సూపర్-4లో భాగంగా మూడ్రోజుల వ్యవధిలో రెండు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. ఆ రెండింట్లోనూ విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనైతే ఏకంగా 228 రన్స్ తేడాతో గెలిచింది భారత్. రెండో మ్యాచ్‌లో లంక నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ 41 రన్స్ తేడాతో గెలిచి ఆసియా కప్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టుపై చాలా సందేహాలు, అనుమానాలు ఉండేవి. ఆటగాళ్ల ఫామ్ పైనా ఆందోళన ఉండేది. అవన్నీ పాక్, లంకతో మ్యాచ్‌లతో తీరిపోయాయి. కానీ ఒక ప్లేయర్ విషయంలో మాత్రం ఆందోళన వీడటం లేదు. అతడే రవీంద్ర జడేజా.
భారత జట్టులో ఉన్న నాణ్యమైన ఆల్రౌండర్లలో ఒకడు రవీంద్ర జడేజా. టీమ్ సక్సెస్‌లో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడీ స్టైలిష్ ప్లేయర్. ఈ ఆసియా కప్‌లోనూ బాగానే రాణిస్తున్నాడు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కీలకమైన 2 వికెట్లు తీశాడు. బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా ఈ స్టార్ ప్లేయర్‌కు వంక పెట్టడానికి లేదు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం జడ్డూ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా బ్యాటింగ్ చేసే ఈ లెఫ్డాంటెడ్ బ్యాటర్.. ఇంటర్నేషనల్ మ్యాచుల్లో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటిదాకా 181 వన్డేలు ఆడిన జడ్డూ.. కేవలం 2,578 రన్స్ మాత్రమే చేశాడు.
ఈ ఆసియా కప్‌లో కూడా బ్యాటింగ్‌లో ఫ్లాప్ అవుతున్నాడు జడేజా. గ్రూప్ స్టేజ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం 14 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. సూపర్-4లో భాగంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అయితే కేవలం 4 రన్స్‌కే వికెట్ సమర్పించుకున్నాడు. కీలకమైన ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న జడ్డూ వరుసగా ఫెయిల్ అవుతుండటం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరుస్తోంది. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడాల్సిన సీనియర్ ప్లేయర్ ఇలా ఈజీగా ఔట్ అవ్వడం విమర్శలకు దారితీస్తోంది.
కేవలం బౌలింగ్, ఫీల్డింగ్ ఉంటే చాలు.. బ్యాటింగ్‌తో తనకు సంబంధం లేదన్నట్లుగా జడ్డూ వ్యవహరించడంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. జడ్డూ ఇకనైనా జట్టులో తన బాధ్యతను గుర్తించి బ్యాటింగ్‌లోనూ రాణించాలని కోరుకుంటున్నారు. యువరాజ్ సింగ్ లాంటి ఆల్‌రౌండర్లు రాణించడం వల్లే 2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్‌లను భారత జట్టు గెలుచుకుందని గుర్తు చేస్తున్నారు. ప్రపంచ కప్‌కు ఎక్కువ సమయం లేనందున జడేజా బ్యాటింగ్ ఫామ్ అందుకోవడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని చెబుతున్నారు. మరి.. ఇకనైనా జడ్డూ మారి.. బౌలింగ్, ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తాడేమో చూడాలి.
ఇదీ చదవండి: భారత్‌కు ఎదురుదెబ్బ.. టీమ్‌లోకి ఉమ్రాన్ మాలిక్!