SNP
SNP
రవిచంద్రన్ అశ్విన్.. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నింగ్ ఆఫ్ స్పిన్నర్. కానీ, చాలా కాలంగా భారత వన్డే జట్టులో ఉండటం లేదు. కేవలం టెస్టులు, టీ20లకు మాత్రమే పరిమితం అవుతున్నాడు. జట్టులోని కొంతమంది ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి.. టీ20 వరల్డ్ కప్ 2022, వన్డే వరల్డ్ కప్ 2023 కోసం జట్లను సిద్ధం చేసే ప్రక్రియలో అశ్విన్‌కు వన్డే టీమ్‌లో చోటు కల్పించలేకపోయాం అంటూ.. టీమిండియా మేనేజ్‌మెంట్ పలుమార్లు చెప్పుకొచ్చింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒక నిర్ధిష్టమైన విజన్‌తో ముందుకు వెళ్తుండటంతో కొంతమంది ఆటగాళ్లు పర్టిక్యూలర్‌గా ఒకటీ రెండు ఫార్మాట్‌లకే పరిమితం అవుతున్నారు. అలాంటి వారిలో అశ్విన్ కూడా ఒకడు.
అయితే.. తాజాగా అశ్విన్‌ను ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేశారు. ఈ నెల 22 నుంచి 27 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ 2023కి ముందు ఈ సిరీస్ జరగనుండటంతో ఎంత కీలకంగా మారింది. ఇప్పటికే భారత సెలెక్టర్లు వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించారు. కానీ, తాజాగా ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టును చూస్తే.. వరల్డ్ కప్ టీమ్‌లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రవిచంద్రన్ అశ్విన్‌ను వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నట్లు సమాచారం.
బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. తాజాగా ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడటంతో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌కు దూరం అయ్యాడు. అతను వరల్డ్ కప్ వరకు కోలుకుంటే సరే.. లేకుంటే అతని స్థానంలో టీమిండియాకు క్వాలిటీ స్పిన్ ఆల్‌రౌండర్ కావాలి. అక్షర్ స్థానంలో ఆసియా కప్ ఫైనల్‌లో వాషింగ్టన్ సుందర్‌ను టీమిండియా ఆడించింది. కానీ, వరల్డ్ కప్ భారత్‌లో జరగనున్న నేపథ్యంలో క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ కమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్ అయితే బెటర్ అని రోహిత్ భావిస్తున్నాడు. అందుకే అశ్విన్ వైపు రోహిత్ మొగ్గు చూపుతున్నాడు. పైగా జట్టులో రైట్ ఆర్మ్ క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ సైతం టీమిండియాలో లేకపోవడం కూడా రోహిత్.. అశ్విన్‌ను ప్రిఫర్ చేయడానికి కారణంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain Rohit Sharma keeps options open for India’s spin all-rounder slot in ODI World Cup 2023.
Will Ravichandran Ashwin make a comeback into the ODI squad? pic.twitter.com/0MwCOSCBAD
— CricTracker (@Cricketracker) September 18, 2023
Coming 🆙 next 👉 #INDvAUS
Here are the #TeamIndia squads for the IDFC First Bank three-match ODI series against Australia 🙌 pic.twitter.com/Jl7bLEz2tK
— BCCI (@BCCI) September 18, 2023
ఇదీ చదవండి: యువీ 6 సిక్సుల విధ్వంసానికి 16 ఏళ్లు పూర్తి! గెలికి మరీ కొట్టించుకున్నారు..