iDreamPost

Ashwin: ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌తో చరిత్ర సృష్టించిన అశ్విన్‌!

  • Published Feb 16, 2024 | 3:27 PMUpdated Feb 16, 2024 | 3:27 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలె వికెట్‌ తీసుకోవడం ద్వారా అశ్విన్‌ ఈ ఘనత అందుకున్నాడు. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అద్భుత ప్రదర్శనతో టెస్ట్‌ జట్టులో కీలక ప్లేయర్‌గా మారిన అశ్విన్‌.. భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. ఈ క్రమంలో టెస్ట్‌ క్రికెట్‌లో 500వ వికెట్‌ సాధించాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలేను అవుట్‌ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. టీమిండియా తరఫున 500 టెస్ట్‌ వికెట్లు సాధించి రెండో స్పిన్నర్‌గా, తొలి ఆఫ్‌ స్పిన్నర్‌గా అశ్విన్‌ నిలిచాడు. అతని కంటే ముందు.. దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే ఈ ఘనత అందుకున్నాడు. అలాగే టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన 9వ బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.

తన కెరీర్‌లో ఇప్పటివరకు 98 టెస్టులు ఆడిన అశ్విన్‌ 500 వికెట్లు సాధించాడు. అందులో 34 సార్లు 5 వికెట్ల హాల్‌, 8 సార్లు 10 వికెట్ల హాల్‌ సాధించాడు. అలాగే 116 వన్డేల్లో 156 వికెట్లు పడగొట్టాడు. 65 టీ20 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ 72 వికెట్లు తీసుకున్నాడు. ఇక అశ్విన్‌ ఈ రికార్డును సాధించడంపై దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే సంతోషం వ్యక్తం చేశాడు. తన రికార్డును కూడా అశ్విన్‌ బ్రేక్‌ చేసి.. టీమిండియా తరఫున అగ్రస్థానంలోకి రావాలని ఆకాంక్షించాడు. ఓవరాల్‌గా శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరణ్‌ 800 వికెట్లతో ప్రపంచంలోనే అత్యధిక టెస్ట్‌ వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నారు. రెండో స్థానంలో షేన్‌ వార్న్‌ 708 వికెట్లతో నిలిచాడు. ఇక టీమిండియా దిగ్గజ బౌలర్‌ అనిల్‌ కుంబ్లే 619 వికెట్లతో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నారు. మరి అశ్విన్‌ 500 టెస్ట్‌ వికెట్లు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి