iDreamPost

రోహిత్ గొప్పతనం అప్పుడు తెలిసింది.. ఆ రోజు ఏం చేశాడంటే?: అశ్విన్

ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో 3వ టెస్ట్ సందర్భంగా రోహిత్ శర్మ చేసిన సాయం గురించి తొలిసారి వెల్లడించాడు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఆ రోజు రోహిత్ గొప్ప మనసు అర్ధమైందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో 3వ టెస్ట్ సందర్భంగా రోహిత్ శర్మ చేసిన సాయం గురించి తొలిసారి వెల్లడించాడు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఆ రోజు రోహిత్ గొప్ప మనసు అర్ధమైందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

రోహిత్ గొప్పతనం అప్పుడు తెలిసింది.. ఆ రోజు ఏం చేశాడంటే?: అశ్విన్

కెప్టెన్ అంటే కేవలం గెలుపు, ఓటములను మాత్రం దృష్టిలో పెట్టుకుంటే సరిపోదు. జట్టులో ఉన్న ప్రతీ ఒక్క ఆటగాడిని కాపాడుకుంటూ రావాలి. ఏ ప్లేయర్ అయినా కష్టాల్లో ఉన్నాడు అంటే అతడికి అండగా నిలబడాలి, నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి. అలాంటి నాయకుడినే కోరుకుంటారు ప్లేయర్లు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలాంటి గొప్ప సారథి అని అతడిపై ప్రశంసలు కురిపించాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. రోహిత్ గొప్ప మనసు ఆ రోజు తెలిసిందని ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని నిజాన్ని వెల్లడించాడు. మరి ఆ రోజు ఏం జరిగింది? తెలుసుకుందాం పదండి.

ఇంగ్లండ్ తో ఇటీవల జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మూడో టెస్ట్ మధ్యలో అర్ధాంతరంగా చెన్నై వెళ్లొచ్చాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ విషయం అప్పుడు చర్చనీయాంశంగా మారింది. అశ్విన్ అలా సడెన్ గా చెన్నై వెళ్లడానికి కారణం ఏంటో అప్పడు ఎవ్వరికీ తెలీదు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఐసీయూలో చికిత్స తీసుకుంటుండటంతో.. అతడు ఎమర్జెన్సీగా వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ రోజు రోహిత్ శర్మ చేసిన సాయం మర్చిపోలేనని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో అశ్విన్ మాటల్లోనే విందాం.

ashwin amotional word about rohit 2

“అమ్మకు అనారోగ్యం అని తెలియగానే.. నేను గదిలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాను. ఎవ్వరి ఫోన్ కాల్స్ తీయడం లేదు. అప్పుడు రూమ్ లోకి రోహిత్, ద్రవిడ్ నా దగ్గరికి వచ్చారు. నేను విషయం చెప్పాను. ఇప్పుడు నేను వెళితే.. జట్టు 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది. డాక్టర్ కు ఫోన్ చేసి అమ్మ స్పృహలో ఉందా? అని అడిగితే.. లేదని చెప్పడంతో నా గుండె ముక్కలైంది. వెళ్దామంటే ఆ టైమ్ కు ఏ విమానం కూడా లేదు. ఇలాంటి సమయంలో రోహిత్ వచ్చి.. నాకు ధైర్యం చెప్పాడు. ఎక్కువ ఆలోచించకుండా ముందు ఇక్కడి నుంచి బయల్దేరమని చెప్పాడు. వారు స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఇక నేను ఎయిర్ పోర్ట్ కు వెళ్లేసరికి ఫిజియో కమలేశ్ నాకోసం సిద్దంగా ఉన్నాడు. నాకు తోడుగా వెళ్లమని రోహిత్ అతడికి చెప్పాడు. ఆ రోజు రోహిత్ లో ఉన్న గొప్ప నాయకుడిని చూశాను” అంటూ జరిగింది చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్.

అయితే నేను కెప్టెన్ గా ఉన్నా ప్లేయర్ ను వెళ్లమని చెబుతాను గానీ.. ఇలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేవాడిని కాదేమో అని అశ్విన్ తెలిపాడు. ఈ క్లిష్ట సమయంలో నా వెంట ఎవ్వరూ లేకపోతే.. చాలా ఇబ్బందిపడేవాడినని ఈ స్టార్ స్పిన్నర్ భావోద్వేగానికి లోనైయ్యాడు. ఇలాంటి టైమ్ లో రోహిత్ నాకు ఇచ్చిన సపోర్ట్ ను నేను నా జీవితంలో మర్చిపోలేనని అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరి ఓ ఆటగాడి అవసరాన్ని అర్ధం చేసుకుని గొప్ప మనసు చాటుకున్న కెప్టెన్ రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: హార్దిక్ పాండ్యా దేశం కోసం ఆడేవాడు కాదు.. అతడికి డబ్బే ముఖ్యం: భారత మాజీ క్రికెటర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి