iDreamPost

ప్రజల వద్దకే ప్రభుత్వం – ఇంటింటికీ రేషన్

ప్రజల వద్దకే ప్రభుత్వం – ఇంటింటికీ రేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎన్నికల హామీలను అమలుచేసి ప్రజా ప్రయోజనాలకు పెద్దపీఠ వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకంతో ముందుకు రాబోతోంది. నూతన సంవత్సరం మరో వినూత్న కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తోంది. జనవరి ఒకటి నుంచి ఇంటింటికీ రేషన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజా సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్నే మార్చేస్తున్న ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పథకంతో ప్రజలకు మరింత చేరువకానుంది.

నిత్యావసరాల కోసం రేషన్ షాపుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సరుకులను ఇంటి వద్దకే చేర్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పా్ట్లనూ పూర్తి చేసింది. 9260 వాహానాల ద్వారా ఇంటింటికీ రేషన్ అందించనుంది ప్రభుత్వం. డోర్ డెలివరీ కోసం ఇప్పటికే టాటా, సుజికి సంస్థల నుంచి వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ట్రక్కుల్లోనే సరుకులను తూచి లబ్దిదారులకు ఇంటి వద్దే రేషన్ అందజేస్తారు. అందుకు తగినట్లుగా ట్రక్కుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హోం డెలివరీ ట్రక్కులు కాలనీల్లోకి వెళ్లి ప్రజలందరికీ తెలిసేలా ప్రకటించి కేటాయించిన సరుకులను అందజేస్తారు. ఈ ట్రక్కులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించనున్నారు. మొత్తం యూనిట్ కాస్ట్ లో 60 శాతం సబ్సిడీ అందించనున్నారు. 30 శాతం బ్యాంకు లోన్ పోగా, 10 శాతం లబ్దిదారుని వాటా చెల్లించి ట్రక్కులను పొందే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు అదనపు ప్రయోజనం చేకూరనుంది.

ప్రజా పంపిణీ వ్యవస్థలో వినూత్న మార్పులకు తెరతీయనుంది ఏపీ సర్కారు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగానే నాణ్యమైన బియ్యం సహా నిత్యావరసరాలను హోమ్ డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేశారు.

ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. హోం డెలివరీలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడంతో ఇప్పుడీ పథకాన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.

జనవరి నుంచి ప్రారంభంకానున్న ఈ పథకం కింద ప్రతినెలా 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లను తొలగిస్తారనే వాదనలనూ ప్రభుత్వం తిప్పికొట్టిది. రేషన్ డీలర్లను తొలగించమంటూ స్పష్టతనిచ్చింది. మరోవైపు రాష్ట్రంలో చాలా రేషన్ కార్డులు రద్దయ్యాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికీ ప్రభుత్వం సమాధానం చెప్పింది. అర్హులైన వారు ఎవరైనా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు… స్వంత గ్రామాలకు దూరంగా ఉంటూ పోర్టబిలిటీ ద్వారా రేషన్ పొందుతున్న వారికీ ఇబ్బందులు ఎదరవ్వకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తోంది. రేషన్ కార్డుల మ్యాపింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. తద్వారా ఇరత ప్రాంతాల్లో నివసించేవారికి అక్కడే రేషన్ అందేలా ఏర్పాట్లు చేయనుంది ప్రభుత్వం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి