iDreamPost

AP: మహిళలకు శుభవార్త.. ఫిబ్రవరి 3 నుంచి లక్కీ ఛాన్స్!

  • Published Feb 01, 2024 | 6:13 PMUpdated Feb 01, 2024 | 6:13 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ఒక శుభవార్తను అందిస్తూ.. ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ఒక శుభవార్తను అందిస్తూ.. ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 01, 2024 | 6:13 PMUpdated Feb 01, 2024 | 6:13 PM
AP: మహిళలకు శుభవార్త.. ఫిబ్రవరి 3 నుంచి లక్కీ ఛాన్స్!

ఏపీ ప్రభుత్వం మహిళలకు చేయూతను అందించే విధంగా.. ఎప్పుడు తన వంతు కృషిని అందిస్తూనే ఉంటుంది. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా.. ఇప్పటికే ఎన్నో పథకాలను అమమలులోకి తీసుకుని వచ్చింది. మహిళా సాధికారతే లక్ష్యంగా తమ వంతు సాయాన్ని అందచేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్తూ.. ఓ ప్రకటన చేసింది ప్రభుత్వం. ఇప్పటికే సమాజంలో చిన్నదో పెద్దదో ఎదో ఒక వ్యాపారాన్ని.. కొనసాగిస్తున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు. అటువంటి మహిళలందరికీ ఇదొక మంచి అవకాశం అని చెప్పి తీరాలి. ఆంధ్రప్రదేశ్ లో అంగడి-2 కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తోంది. ఆసక్తి కలిగిన మహిళలకు ఇదొక మంచి అవకాశం అని చెప్పి తీరాలి.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా వ్యాపారులు.. తమ వ్యాపార ఉత్పత్తులను, ముడిపదార్ధాలను ఒక చోట ప్రదర్శించి.. విక్రయించుకునే వేదికను మరోసారి ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దానినే అంగడి కార్యక్రమం అంటారు. గత సంవత్సరం ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో.. ఇప్పుడు కూడా అలానే ఏర్పాటు చేయనున్నారు. అదే అంగడి-2 కార్యక్రమం. ఇందులో మహిళలు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కేవలం వారికీ మాత్రమే ప్రత్యేకించి కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామీణ , గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువమంది మహిళలు పాల్గొంటూ ఉంటారు. అయితే.. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే కేవలం వ్యాపారస్తులు లేదా ఆసక్తి కలిగిన వారు మాత్రమే అయ్యి ఉండాలి. ఈ కార్యక్రమం ఏపీలోని విశాఖలో జరగనుంది. విశాఖలో దస్పల్లా హోటల్‌లోని దర్శిని, సందర్శిని హాల్‌లో ఇవి ఉంటాయి. ఫిబ్రవరి మూడు నుంచి రెండు రోజుల పాటు అంగడి 2 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన మహిళా వ్యాపారస్తులు ఎవరైనా సరే ఈ అంగడిలో వారి వ్యాపార వస్తువులను ప్రదర్శించుకోవచ్చు. కాగా, గ్రామీణ, గిరిజన మహిళా వ్యాపారస్తులను ప్రోత్సహించడానికి.. ఏపి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఉమెన్స్ వింగ్ .. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Good news for women

అయితే, రెండు రోజుల పాటు జరిగే ఈ అంగడి-2 కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న నిర్వహాకురాలు.. యార్లగడ్డ గీతా శ్రీకాంత్. ఇక ఈ ఎక్స్‌పోలో వివిధ రంగాల్లోని మహిళా వ్యాపారవేత్తల ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించనున్నారు. వాటిలో ఆర్ట్ ఉత్పత్తులు, సబ్బులు, పెర్ఫ్యూమ్‌లు, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఖాదీ చీరలు, పెయింటింగ్‌లు, రెసిన్ ఆర్ట్ , జ్యూట్ ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు కోల్డ్ ప్రెస్‌డ్ ఆయిల్స్, చిరుధాన్యాల ఉత్పత్తులు, హస్తకళా ఉత్పత్తులు ఇలా అన్నింటిని ప్రదర్శనకు అనుమంతించనున్నారు. ఇక మహిళా ఎంట్రిప్రీనర్స్ కోసం చేస్తోన్న ఈ కార్యక్రమానికి.. అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఏదేమైనా.. మహిళలను ముందుకు నడిపించే దిశగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందించ తగిన విషయం. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి