iDreamPost

ఫేక్ వీడియోపై రష్మికా మందన్న ఎమోషనల్ పోస్ట్!

రష్మికాకి సంబంధించిన ఒక ఫేక్ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోకి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై రష్మికా మందన్నా ఎమోషనల్ పోస్ట్ చేసింది.

రష్మికాకి సంబంధించిన ఒక ఫేక్ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోకి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై రష్మికా మందన్నా ఎమోషనల్ పోస్ట్ చేసింది.

ఫేక్ వీడియోపై రష్మికా మందన్న ఎమోషనల్ పోస్ట్!

రష్మికా మందన్న.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్. అతి తక్కువ కావలంలోనే నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా పొందింది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా, వీడియో షేర్ చేసినా మిలియన్ల కొద్దీ వ్యూస్, లైకులు వచ్చేస్తాయి. ఆ క్రేజ్ ని వాడుకోవాలని కొందరు చేసిన ఓ ప్రయత్నం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

టెక్నాలజీ అనే మనిషి జీవితంలో ఒక భాగం అయింపోయింది. సాంకేతికత ద్వారా మనిషి తన జీవితాన్ని ఎంతో మెరుగు పరుచుకుంటున్నాడు. కానీ, పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మనిషికి ఇబ్బందులు కూడా అలాగే పెరుగుతున్నాయి. తాజాగా రష్మిక ఐడెంటినీ వాడుకుని ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ కూడా వచ్చాయి. చాలా మంది ఆ వీడియోలో ఉంది రష్మికా అని పొరబడ్డారు కూడా. కానీ, తర్వాత ఆ వీడియో ఫేక్ అని తెలుసుకున్నారు. అప్పటికే అది దేశవ్యాప్తంగా ఎంతో వైరల్ అయ్యింది. ఈ ఫేక్ వీడియో విషయంలో ఎంతో మంది స్పందించారు. అమితాబ్ లాంటి వాళ్లు కూడా ఇలాంటి పనిని తీవ్రంగా ఖండించారు.

రష్మిక కూడా ఆ ఫేక్ వీడియోపై స్పందించింది. తన సోషల్ మీడియాలో ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. “నాకు సంబంధించి డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంపై మాట్లాడాలంటే నాకు బాధగా ఉంది. కానీ, ఈ విషయాన్ని కచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఈ టెక్నాలజీ చూస్తుంటే భయమేస్తోంది. ఈ టెక్నాలజీ వల్ల నేను ఒక్క దాన్నే కాదు.. మనం అందరం కూడా ప్రమాదంలో ఉన్నట్లే. ఈరోజు ఒక మహిళగా, ఒక నటిగా నాకు నా కుటుంబం, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషుల నుంచి అందుతున్న రక్షణ, మద్దతుకు ధన్యురాలిని. ఒకవేళ ఇలాంటి ఒక ఘటన నేను కాలేజ్, స్కూల్ రోజుల్లో ఉన్నప్పుడు జరిగితే ఎలా నెగ్గుకొచ్చేదాన్నో? ఈ సమస్యను మనం ముక్తకంఠంతో ఖండించాలి. మరికొంత మంది ఇలాంటి సమస్యను ఎదుర్కోక ముందే అత్యవసరంగా  దీనిపై స్పందించాలి” అంటూ రష్మికా మందన్నా ఎమోషనల్ అయ్యింది.

ఇది ఫేక్ వీడియో అని అభిషేక్ అనే జర్నలిస్ట్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. డీప్ ఫేక్ వీడియో విషయంలో భారత్ లో కఠిన చట్టాలు, తీసుకోవాల్సిన చర్యల విషయంలో త్వరిత గతిన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ చెప్పుకొచ్చాడు. వైరల్ అవుతున్న ఫేక్ వీడియోకి సంబంధించిన ఒరిజినల్ వీడియో కూడా తన ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఉన్నది బ్రిటిష్- ఇండియన్ అమ్మాయి జారా పటేల్ గా చెప్పారు. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 4 లక్షలకు పైగా ఫాలోవల్స్ ఉన్నారు. మరి.. రష్మికా మందన్న ఫేక్ వీడియో వైరల్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి