iDreamPost

rashmika mandanna బాలీవుడ్ మీదే రష్మిక చూపు

rashmika mandanna బాలీవుడ్ మీదే రష్మిక చూపు

ఇప్పుడు సౌత్ లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే తర్వాత వినిపించే పేరు రష్మిక మందన్న. పుష్పలో చేసిన శ్రీవల్లి క్యారెక్టర్ తో మాస్ కి మరింత దగ్గరైన ఈ శాండల్ వుడ్ భామకు ఛలోతో మొదలుకుని భీష్మ దాకా వచ్చిన బ్లాక్ బస్టర్లు మంచి మార్కెట్ ఇచ్చాయి. డియర్ కామ్రేడ్, దేవదాస్, ఆడవాళ్ళూ మీకు జోహార్లు నిరాశపరిచినా వాటి ప్రభావం కెరీర్ మీద పడలేదు.

ఇదిలా ఉండగా రష్మిక మందన్న బాలీవుడ్ లో జెండా పాతేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆల్రెడీ సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్ పూర్తి కానుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో మొదటిసారి చేస్తున్న గుడ్ బైలో చాలా కీలకమైన పాత్ర కొట్టేసింది. రన్బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోయే యానిమల్ లో కూడా తనే హీరోయిన్

ఇవి కాకుండా తాజాగా టైగర్ శ్రోఫ్ తో కూడా జట్టు కట్టబోతున్నట్టు సమాచారం. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని ఇంట్రొడ్యూస్ చేసిన శశాంక్ ఖైతన్ డైరెక్షన్ లో రూపొందబోయే భారీ యాక్షన్ కం రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో రష్మికనే లాక్ చేశారట. తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మేనని ముంబై మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది