iDreamPost

వీడియో: ముంబై విక్టరీ.. మాస్ డాన్స్​తో ఇరగదీసిన శ్రేయస్ అయ్యర్!

  • Published Mar 14, 2024 | 7:03 PMUpdated Mar 14, 2024 | 7:03 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మాస్ డాన్స్​తో ఇరగదీశాడు. అతడి డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మాస్ డాన్స్​తో ఇరగదీశాడు. అతడి డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

  • Published Mar 14, 2024 | 7:03 PMUpdated Mar 14, 2024 | 7:03 PM
వీడియో: ముంబై విక్టరీ.. మాస్ డాన్స్​తో ఇరగదీసిన శ్రేయస్ అయ్యర్!

రంజీ ట్రోఫీ-2024ను ముంబై జట్టు కైవసం చేసుకుంది. మ్యాచ్ రెండో రోజు నుంచి పట్టుబిగిస్తూ వచ్చిన రహానె సేన.. ఐదో రోజు వరకు దాన్ని నిలబెట్టుకొని బంపర్ విక్టరీ కొట్టింది. ఫైనల్​లో విదర్భను ఏకంగా 169 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్​లో మొదటి ఇన్నింగ్స్​లో ముంబై 224 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సంతోషంలో ఉన్న విదర్భ భారీ స్కోరు చేసి మ్యాచ్​ను గ్రిప్​లోకి తెచ్చుకోవాలని అనుకుంది. కానీ ముంబై బౌలర్లు చెలరేగడంతో ఆ టీమ్ 105 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ముంబై రెండో ఇన్నింగ్స్​లో 418 పరుగులు చేసి 538 పరుగుల భారీ టార్గెట్​ను విదర్భ ముందు ఉంచింది. కానీ ఆ జట్టు 368 పరుగులు మాత్రమే చేసి ట్రోఫీని చేజార్చుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ డాన్స్ చేయడం హైలైట్​గా నిలిచింది.

రికార్డు స్థాయిలో ముంబై 42వ సారి రంజీ ట్రోఫీని గెలుచుకోవడంతో ఆ జట్టు సభ్యులంతా సంబురాల్లో మునిగిపోయారు. గ్రౌండ్​లో వందలాదిగా ఉన్న ముంబై అభిమానులు కూడా తమ జట్టు విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ముంబై.. ముంబై అంటూ గట్టిగా అరుస్తూ, ఈలలు వేస్తూ సందడి చేశారు. ఆ టైమ్​లో ఫుల్ జోష్​లో ఉన్న ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టేడియంలో ఫ్యాన్స్ డ్రమ్స్ వాయిస్తుండటంతో దానికి తగ్గట్లు తన కాళ్లను కదిపాడు. చేతులతో గెలిచామంటూ చూపిస్తూ మాస్ డాన్స్​తో ఇరగదీశాడు. అయ్యర్​కు తోడుగా మరికొందరు ముంబై ఆటగాళ్లు కూడా డాన్స్ చేయడంతో స్టేడియం అంతా ముంబై.. ముంబై అనే నినాదాలతో హోరెత్తింది.

అయ్యర్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు ఆటతో పాటు డాన్స్​తో మా హృదయాలు గెలుచుకున్నావ్ బాస్ అని కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ డాన్స్ అయ్యర్.. ఐపీఎల్​లోనూ ఇదే జోరును కొనసాగించాలని కోల్​కతా నైట్ రైడర్స్ అభిమానులు అంటున్నారు. క్యాష్​ రిచ్​ లీగ్​ల్ అతడు కేకేఆర్​కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక, విదర్భతో జరిగిన ఫైనల్​లో తొలి ఇన్నింగ్స్​లో 7 పరుగులు చేసి ఫెయిలైన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్​లో మాత్రం అదరగొట్టాడు. 95 పరుగుల సూపర్బ్ నాక్​తో ముంబై భారీ స్కోరుకు అతడు బాటలు వేశాడు. ఇదే ఫామ్​ను ఐపీఎల్​లోనూ కంటిన్యూ చేస్తే అయ్యర్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని చెప్పాలి. మరి.. శ్రేయస్ మాస్ డాన్స్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాండ్యా కెప్టెన్సీలో ఆడటం రోహిత్​కు ఇష్టం లేదా? పోస్ట్ డిలీట్ దేనికి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి