iDreamPost
android-app
ios-app

నా లైఫ్ లో నేను తీసుకున్న మంచి నిర్ణయం అదే: రమ్యకృష్ణ

  • Author Soma Sekhar Published - 09:57 PM, Wed - 9 August 23
  • Author Soma Sekhar Published - 09:57 PM, Wed - 9 August 23
నా లైఫ్ లో నేను తీసుకున్న మంచి నిర్ణయం అదే: రమ్యకృష్ణ

వెండితెరపై ఎన్నో జోడీలు కనిపించాయి, కనిపిస్తూనే ఉన్నాయి.. ఉంటాయి కూడా. కానీ అన్ని జోడీలను గుర్తుపెట్టుకోరు ప్రేక్షకులు. వారి మదిని దోచిన జంటను మాత్రమే వారు అభిమానిస్తూ ఉంటారు. అలా వెండితెరపై కలిసి నటించిన జంటను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు. ఆ జోడీ మరెవరో కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్-రమ్యకృష్ణ. వీరిద్దరు కలిసి 1999లో వచ్చిన ‘నరసింహా’ సినిమాలో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. మళ్లీ 24 ఏళ్ల తర్వాత ‘జైలర్’ సినిమాలో జోడీగా కనిపించబోతున్నారు. ఈ మూవీ ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే తన కెరీర్ లో కీలక ఘట్టాల గురించి చెప్పుకొచ్చారు నటి రమ్యకృష్ణ. బాహుబలి సినిమా కోసం దర్శకదీరుడు రాజమౌళికి కండీషన్స్ పెట్టా అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రమ్యకృష్ణ.. కుర్రాళ్ల కలల రాకుమారిగా, హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. తనదైన నటనతో పాటుగా తన అందంతో ఇండస్ట్రీని మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు రమ్యకృష్ణ. తాజాగా ఈమె సూపర్ స్టార్ రజినీ సరసన జైలర్ మూవీలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నరసింహ మూవీ సంగతులను గుర్తు చేసుకున్నారు రమ్యకృష్ణ.

ఆమె మాట్లాడుతూ..”నరసింహలో నీలాంబరి పాత్రలో నాకు అవకాశం వచ్చినప్పుడు నేను సెకండ్ హీరోయిన్ హా.. మెుదటి హీరోయిన్ హా అని ఆలోచించలేదు. సూపర్ స్టార్ రజినీ అనగానే ఒకే చెప్పేశా. ఆయన క్రేజ్ అలాంటిది మరి. ఈ సినిమాను ఓకే చేయడమే నా జీవితంలో నేను తీసుకున్న అత్యున్నత నిర్ణయం. అయితే ఈ సినిమాలో నేను సౌందర్య ముఖం మీద నేను కాలు పెట్టే సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని భయపడ్డాను” అంటూ చెప్పుకొచ్చారు రమ్యకృష్ణ.

ఇక నరసింహ తర్వాత మళ్లీ ఆస్థాయి పేరు తీసుకొచ్చిన సినిమా బాహుబలి అని ఆమె తెలిపింది. ఇక్కడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే? బాహుబలిలో నటించడానికి రాజమౌళికి కండిషన్స్ పెట్టా అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది. రాత్రిపూట షూటింగ్ చేయను, కొద్దిరోజులు మాత్రమే షూటింగ్ చేస్తా అంటూ రమ్యకృష్ణ పెట్టిన కండిషన్స్ ను జక్కన అంగీకరించారు. కాగా.. రజినీకాంత్, చిరంజీవి వెండితెరపై కనిపిస్తే.. పిల్లల నుంచి ముసలోళ్ల వరకు అందరు ఈలలు వేస్తారని రమ్యకృష్ణ ప్రశంసించింది. వీరిద్దరి లాంటి స్టార్ భవిష్యత్ లో వస్తారో.. లేదో తెలీదు కాని, వీరిలా సుదీర్ఘ కాలం స్టార్ డమ్ ను మాత్రం కొనసాగించలేరని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది. మరి శివగామి చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలు తెలియజేయండి.

ఇదికూడా చదవండి: హీరోయిన్లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి: ఆమని

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş