iDreamPost

నారా లోకేష్‌పై RGV సెటైర్లు.. ఆస్కార్‌ కూడా తక్కువేనంటూ!

  • Published Jun 15, 2023 | 2:24 PMUpdated Jun 15, 2023 | 2:24 PM
  • Published Jun 15, 2023 | 2:24 PMUpdated Jun 15, 2023 | 2:24 PM
నారా లోకేష్‌పై RGV సెటైర్లు.. ఆస్కార్‌ కూడా తక్కువేనంటూ!

వివాదాల​​కు కెరాఫ్‌ అడ్రెస్‌గా నిలుస్తారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. సినిమాలు, రాజకీయాలు.. ఇలా ఆయనకు ఏది తోస్తే అది.. ఆయా రంగాలకు సంబంధించిన వారిపై సెటైర్లు వేయడం.. ట్విట్టర్‌లో రచ్చ చేయడం ఆర్జీవీకి హాబీ. మరీ ముఖ్యంగా టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ల మీద ఏదో ఓ విమర్శ చేస్తూనే ఉంటాడు. ఇక తాజాగా.. నారా లోకేష్‌ను ఉద్దేశిస్తూ.. ఆర్జీవీ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది. దీనిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండి పడుతున్నారు. ఇంతకు ఆర్జీవీ ఏమన్నాడంటే..

ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే.. పార్టీని బలోపేతం చేయడం కోసం.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు నారా లోకేష్‌. ప్రస్తుతం పాదయాత్ర రాయలసీమలో పూర్తయ్యి.. కోస్తా జిల్లాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో నారా లోకేష్‌.. తనను ఇంతలా ఆదరించిన సీమ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. రాయలసీమలో పాదయాత్ర సమయంలో తనకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు, సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. సీమ నేలకు నమస్కరిస్తూ.. భావోద్వేగానికి గురయ్యారు నారా లోకేష్‌. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో.. అది విపరీతంగా వైరలయ్యాంది.

ఈ క్రమంలో ఆర్జీవీ.. ఈ ఫోటోపై స్పందిస్తూ.. నారా లోకేష్‌ మీద సెటైర్లు వేశారు. టీడీపీ యువనేతను ఎద్దేవా చేస్తూ.. ‘‘యాక్షన్‌ చూశాం.. ఓవర్‌ యాక్షన్‌ చూశాం.. కానీ ఇది అంతకు మించి.. అల్టీమేట్‌ యాక్షన్‌’’ అంటూ సెటైర్లు వేశాడు. అంతేకాక.. ఆస్కార్‌ అవార్డు ఇవ్వాల్సింది ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు, రాజమౌళికి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణికి, హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు కాదు కాదు.. నారా లోకేష్‌కు ఇవ్వాలి అంటూ సెటైర్లు వేశాడు వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరలవుతోంది. దీనిపై తెలుగు తమ్ముళ్లు దీనిపై మండి పడుతున్నారు. ఆర్జీవీని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి