iDreamPost

అనంతపురం సభలో నారా లోకేష్‌కు చేదు అనుభవం!

Nara Lokesh: ఆదివారం అనంతపురం పట్టణంలో శంఖారావం పేరుతో లోకేశ్ సభ నిర్వహించారు. లోకేశ్ నిర్వహిస్తున్న సభలకు జనం ముఖం చాటేస్తున్నారు అనే ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో ఆయనకు మరో చేదు అనుభవం ఎదురైంది.

Nara Lokesh: ఆదివారం అనంతపురం పట్టణంలో శంఖారావం పేరుతో లోకేశ్ సభ నిర్వహించారు. లోకేశ్ నిర్వహిస్తున్న సభలకు జనం ముఖం చాటేస్తున్నారు అనే ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో ఆయనకు మరో చేదు అనుభవం ఎదురైంది.

అనంతపురం సభలో నారా లోకేష్‌కు చేదు అనుభవం!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. 175 స్థానాల్లో గెలుపే టార్గెట్ గా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ ప్రణాళికలతో ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నారు. ఆయన నిర్వహిస్తున్న సిద్ధం సభలు జన సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ నిర్వహిస్తున్న సభలో గొడవలు, నేతలకు చేదు అనుభవాలు, ఖాళీ కుర్చిలు దర్శనమిస్తున్నాయి. ఆదివారం అనంతపురంలో నారా లోకేశ్ నిర్వహించిన సభలో  ఏకంగా ఆయనకే చేదు అనుభవం ఎదురైంది.

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ శంఖారావం పేరిట సభలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే పలు నియోజవర్గాల్లో లోకేశ్ ఈ సభలు నిర్వహించారు. తాజాగా అనంతపురం పట్టణంలో శంఖారావం సభ జరిగింది. ఈ సభలో లోకేశ్ బాబుకి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే లోకేశ్ పాల్గొంటున్న శంఖారావం సభలకు జనాలు ముఖం చాటేస్తున్నారు. ఆయన ప్రసంగం సమయంలో ఖాళీ కుర్చిలే దర్శనం ఇస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది సరిపోదన్నట్లు.. ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి కుమ్మలాటలు కూడా లోకేశ్ బాబు సమక్షంలోనే జరుగుతుండడం గమనార్హం.

ఆదివారం అనంతపురంలో జరిగిన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతేకాక ఈ సభలోటీడీపీ, జనసేన పొత్తు బెడిసి కొట్టింది. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అంతర్గత పోరు మరోసారి బయట పడింది. అనంతపురం సిటీ అసెంబ్లీ నియోజవర్గ టికెట్‌ తమకంటే, తమకే కావాలని టీడీపీ, జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుని ఘర్షణ వాతావరణం సృష్టించారు. నారా లోకేశ్ స్టేజ్‌ మీద మాట్లాడుతున్న సమయంలోనే ఇదంతా జరిగినట్లు సమాచారం. అనంతపురం పట్టణ నియోజవర్గం నుంచి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన 2019 అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు.

తాజాగా మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేయాలని ప్రభాకర్ చౌదరి భావిస్తున్నారు. ఇదే సమయంలో పొత్తులో భాగంగా జనసేన తరఫున టీసీ వరుణ్‌ ఇక్కడి నుంచి సీటును ఆశిస్తున్నారని తెలుస్తోంది. కలిసి పని చేయాలని ఇరు పార్టీల అధ్యక్షులు పదే పదే చెబుతున్నా.. ఆయా వర్గాల నేతలు, కార్యకర్తలు ససేమిరా చెబుతుండడం విశేషం. అంతేకాక పరస్పరం ఘర్షణకు దిగిన ఘటనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు స్థానిక నేతల ముందు గొడవలకు దిగిన జనసేన, టీడీపీ శ్రేణులు, ఈ సారి ఏకంగా నారా లోకేశ్ సమక్షంలోనే వాగ్వాదానికి దిగడం గమన్హారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి