iDreamPost

Ram Gopal Varma: Jr. NTR వాళ్ళ తాత కన్నా గొప్పోడు.. RGV ఆసక్తికర వ్యాఖ్యలు!

Jr NTR వాళ్ళ తాత కంటే గొప్పవాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వ్యూహం-శపథం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

Jr NTR వాళ్ళ తాత కంటే గొప్పవాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వ్యూహం-శపథం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

Ram Gopal Varma: Jr. NTR వాళ్ళ తాత కన్నా గొప్పోడు.. RGV ఆసక్తికర వ్యాఖ్యలు!

రామ్ గోపాల్ వర్మ.. ట్విట్ చేస్తే సంచలనం, మాట మాట్లాడితే సంచలనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్జీవీ ఏం చేసినా అది షాకింగ్ న్యూసే అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో వివాదాస్పద డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ టాలెంటెడ్ దర్శకుడు. లేటెస్ట్ గా ఆర్జీవీ తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం-శపథం’. ఏపీ రాష్ట్ర రాజకీయాలపై వస్తున్న ఈ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతోంది. తాజాగా ఈ సినిమాలకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీడియా మిత్రులతో ముచ్చటించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో Jr. NTR వాళ్ళ తాత కన్నా గొప్పోడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆర్జీవీ.

‘వ్యూహం-శపథం’ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రెండు పార్ట్ లుగా ఈ మూవీని తెకెక్కిస్తున్నాడు. వ్యూహం ఫిబ్రవరి 23న, సెకండ్ పార్ట్ శపథం మార్చి 1న రిలీజ్ కానున్నాయి. కాగా.. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..”నా దృష్టిలో సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ గొప్పవాడు” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఆర్జీవీ.

ఇక మరో రిపోర్టర్ జూనియర్ ఎన్టీఆర్ పై డిసెంబర్ 31న ట్వీట్ చేశారుగా.. ఆన్సర్ ఇచ్చాడా? అని ప్రశ్నించాడు. “ఆరోజు ఆ ట్వీట్ వోడ్కా తాగి చేసుంటా” అంటూ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భవిష్యత్ తో ఎన్టీఆర్ తో మూవీ చేస్తారా? అంటే.. అంత కెపాసిటీ నాకు లేదంటూ చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ఇక వ్యూహం-శపథం ట్రైలర్ రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. మరి సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ గొప్పవాడు అన్న ఆర్జీవీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: R Narayanamurthy: టెంపర్ లో పోసాని పాత్ర అందుకే చేయలేదు.. కారణం చెప్పిన ఆర్. నారాయణమూర్తి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి