iDreamPost

R Narayanamurthy: టెంపర్ లో పోసాని పాత్ర అందుకే చేయలేదు.. కారణం చెప్పిన ఆర్. నారాయణమూర్తి

జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ మూవీ వచ్చి నేటికి (ఫిబ్రవరి 13) సరిగ్గా 9 ఏళ్ళు. ఈ సందర్బంగా టెంపర్ మూవీలో పోసాని కృష్ణమురళి చేసిన కానిస్టేబుల్ మూర్తి పాత్ర తాను ఎందుకు చేయలేదో కారణం చెప్పాడు ఆర్ నారాయణమూర్తి.

జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ మూవీ వచ్చి నేటికి (ఫిబ్రవరి 13) సరిగ్గా 9 ఏళ్ళు. ఈ సందర్బంగా టెంపర్ మూవీలో పోసాని కృష్ణమురళి చేసిన కానిస్టేబుల్ మూర్తి పాత్ర తాను ఎందుకు చేయలేదో కారణం చెప్పాడు ఆర్ నారాయణమూర్తి.

R Narayanamurthy: టెంపర్ లో పోసాని పాత్ర అందుకే చేయలేదు.. కారణం చెప్పిన ఆర్. నారాయణమూర్తి

‘టెంపర్’ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్. 2015 ఫిబ్రవరి 13 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో 9 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే విభిన్నమైన చిత్రంగా టెంపర్ నిలిచింది. ఇక ఈ మూవీలో పోసాని కృష్ణమురళి చేసిన కానిస్టేబులు మూర్తి పాత్ర ప్రేక్షకుల్లో ఇప్పటికీ నిలిచిపోయింది. అయితే తొలుత ఈ పాత్ర కోసం ఆర్. నారాయణమూర్తిని సంప్రదించాట డైరెక్టర్ పూరీ, ఎన్టీఆర్. కానీ ఆ పాత్రను ఆయన తిరస్కరించాడు. దానికి కారణం ఏంటో టెంపర్ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుసుకుందాం.

టెంపర్ మూవీలో పోసాని కృష్ణమురళి పోషించిన కానిస్టేబుల్ మూర్తి పాత్ర, ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్లో ఇప్పటికీ నిలిచిపోయాయి. అయితే ఆ పాత్ర కోసం ముందుగా ఆర్. నారాయణమూర్తిని సంప్రదించారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. కానీ కానిస్టేబుల్ మూర్తి పాత్రను ఈ మూర్తి చేయన్నారు. అయితే ఆ పాత్రను ఎందుకు రిజెక్ట్ చేశాడో ఓ సందర్భంగా చెప్పుకొచ్చాడు నారాయణమూర్తి.

“టెంపర్ లో కానిస్టేబుల్ మూర్తి క్యారెక్టర్ ను నాకు ఇవ్వడానికి వచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు నా సెల్యూట్. అయితే ఒక గొప్ప క్యారెక్టర్ నాతో వేయించాలని ఆయన నా దగ్గరకు వచ్చారు. కానీ నేను ఆ పాత్రను చేయనని, మన్నించండని చెప్పాను. దానికి కారణం ఏంటంటే? నేను జూనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. హీరోగా ఎదిగాను. మరో ఐదారేళ్లకు మించి నేను సినిమాలు చేయను. అందుకే మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయకూడదని నిర్ణయించుకున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు” అని చెప్పుకొచ్చాడు ఆర్. నారాయణముర్తి. కాగా.. టెంపర్ లో కానిస్టేబుల్ మూర్తి పాత్ర ఏ రేంజ్ లో పేలిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ.. ‘మీరు మారిపోయారు సార్’ అనే డైలాగ్ ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంటుంది. మరి ఆర్.నారాయణమూర్తి కానిస్టేబుల్ మూర్తి పాత్ర చేస్తే ఎలా ఉండేదో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ‘వ్యూహం-శపథం’ ట్రైలర్ రిలీజ్.. మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసిన RGV!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి