iDreamPost

Ram Charan: ఫ్యాన్స్ కు పండగే.. #RC16 నుంచి కిక్కిచ్చే అప్డేట్!

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న #RC16 మూవీ గురించి ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఆ వార్త ఏంటో చూసేద్దాం పదండి.

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న #RC16 మూవీ గురించి ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఆ వార్త ఏంటో చూసేద్దాం పదండి.

Ram Charan: ఫ్యాన్స్ కు పండగే.. #RC16 నుంచి కిక్కిచ్చే అప్డేట్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #RC16 అనే వర్కింట్ టైటిల్ తో ఈ మూవీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాపై రోజుకో అప్డేట్ ఇస్తూ.. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాడు డైరెక్టర్. అదీకాక పల్లెటూర్లో జరిగే ఒక మట్టి మనిషి కథ అని రామ్ చరణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలోనే వెల్లడించాడు. దీంతో మరో రంగస్థలం రాబోతోందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే?

డైరెక్టర్ బుచ్చిబాబు రెండో సినిమాతోనే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ అగ్రదర్శకుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం వాయిదాలు పడుతూ.. షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. కాగా.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ ముగింపుదశకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న #RC16 సినిమాలో చరణ్ ఎప్పుడు పాల్గొంటాడా? అని అందరు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది.

గేమ్ ఛేంజర్ మూవీని మార్చి లాస్ట్ వరకు పూర్తి చేసుకుని ఏప్రిల్ లో రెస్ట్ తీసుకుని మేలో బుచ్చిబాబుతో తీసే మూవీ షూటింగ్ కు గ్లోబల్ స్టార్ రానున్నాడని తెలుస్తోంది. ఇక ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో.. అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా వృద్ధి సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇండియన్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ ఫిల్మ్ కు వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే పాటలకు సంబంధించిన సిట్టింగ్స్ కూడా జరిగాయని రెండు పాటలు కూడా వినిపించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ పై నాలుగు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపాడు. స్క్రీప్ట్ వర్క్ అంతా పూర్తి అయ్యిందని, రా అండ్ రస్టిక్ గా ఈ పిక్చర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు. చూడాలి మరి బుచ్చిబాబు చరణ్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడో.

ఇదికూడా చదవండి: హరీశ్ శంకర్ సెటైర్స్ బాగా పేలాయి. కానీ.., ఈగల్ ఇకనైనా ఎగురుద్దా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి