iDreamPost
android-app
ios-app

Ram Charan Sarkarodu మెగా మూవీలో చాలా సర్ ప్రైజ్ లు

  • Published Apr 05, 2022 | 1:45 PM Updated Updated Apr 05, 2022 | 1:47 PM
Ram Charan Sarkarodu మెగా మూవీలో చాలా సర్ ప్రైజ్ లు

ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ చేసిన చేయబోతున్న సినిమాల మీద అంచనాలు అమాంతం ఎగబాకుతున్నాయి. ఆచార్య తర్వాత శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ మీద హైప్ ఎక్కడికో వెళ్తోంది. ఇప్పటికే ముప్పై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి బరిలో దింపాలనే లక్ష్యంతో ఉన్నాడు నిర్మాత దిల్ రాజు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కీలక భాగం చిత్రీకరణ జరిపారు. బాలన్స్ ఉన్న ఇంకొంత భాగాన్ని అక్కడే షూట్ చేసి ఆ తర్వాత దుబాయ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కంటిన్యూ చేయబోతున్నారు. తాజాగా వచ్చిన లీక్డ్ అప్డేట్ ఆసక్తికరంగా ఉంది.

ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న వార్త ఎప్పుడో బయటికి వచ్చింది. అందులో ఒకరు తండ్రి కాగా రెండోది కొడుకు క్యారెక్టర్. మొదటి పాత్రకు జోడిగా సీనియర్ హీరోయిన్ అంజలి నటిస్తోందట. ఆల్రెడీ క్యాస్టింగ్ లో ఉన్న కియారా అద్వానీ యంగ్ చరణ్ సరసన ఆడి పడుతుందన్న మాట. మరో ట్విస్ట్ ఏంటంటే ఇందులో చెర్రీ ట్రిపుల్ రోల్ అనే టాక్ కూడా ఉంది. కొంత నెగటివ్ టచ్ తో మూడోది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారని అంటున్నారు.ఒకవేళ ఇదే నిజమైతే తనకిది మొదటి త్రిపాత్రాభినయం అవుతుంది. చిరంజీవి కెరీర్ మొత్తంలో ముగ్గురు మొనగాళ్లులో మాత్రమే మూడు క్యారెక్టర్స్ లో కనిపిస్తారు. కాకపోతే అదేం పెద్ద బ్లాక్ బస్టర్ కాలేదు.

ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఆచార్య రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 29 ఎంతో దూరంలో లేదు సరైన సమయంలో ప్రమోషన్లు మొదలుపెట్టేందుకు కొణిదెల, మ్యాట్నీ సంస్థలు రెడీ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ వేడి ఇంకా కొనసాగుతోంది కాబట్టి ఒకేసారి బీస్ట్, కెజిఎఫ్ 2లు రిలీజ్ అయ్యాక అప్పుడు ఆచార్య పబ్లిసిటీని పెంచుతారు. శంకర్ మూవీ ఈ దసరాలోగా పూర్తి చేయగలిగితే ఆ వెంటనే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ పుణ్యమాని నార్త్ లోనూ ఫ్యాన్ బేస్ అమాంతం పెంచుకున్న చరణ్ కు ఇకపై మినిమమ్ మార్కెట్ నూటా యాభై కోట్లు ఉంటుందని ట్రేడ్ టాక్

 

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş