SNP
Rajasthan Royals, Sunrisers Hyderabad. IPL 2024: ఐపీఎల్ వల్ల ఇండియన్ క్రికెట్ చాలా నష్టం జరుగుతుందని బాధ పడేవారు.. ఈ విషయం కూడా తెలుసుకోవాలి. రెండు ఐపీఎల్ టీమ్స్ వల్ల టీమిండియాకు ఎంతో మేలు జరుగుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Rajasthan Royals, Sunrisers Hyderabad. IPL 2024: ఐపీఎల్ వల్ల ఇండియన్ క్రికెట్ చాలా నష్టం జరుగుతుందని బాధ పడేవారు.. ఈ విషయం కూడా తెలుసుకోవాలి. రెండు ఐపీఎల్ టీమ్స్ వల్ల టీమిండియాకు ఎంతో మేలు జరుగుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆదివారంతో లీగ్ మ్యాచ్‌లు ముగిసిన విషయం తెలిసిందే. ప్రతి టీమ్ 14 మ్యాచ్‌లు ఆడింది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన నాలుగు టీమ్స్.. కోల్‌కత్తా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మంగళవారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. తర్వాత.. బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌ఆర్, ఆర్సీబీ జట్లు తలపడతాయి. క్వాలిఫైయర్-1లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన టీమ్‌తో క్వాలిఫైయర్-1లో ఓడిన టీమ్.. క్వాలిఫైయర్-2లో తలపడుతుంది.. గెలిచిన టీమ్ ఫైనల్ చేరుతుంది. అయితే.. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగు టీమ్స్‌లో ఓ రెండు టీమ్స్.. టీమిండియాకు తెలియకుండానే చాలా మేలు చేస్తున్నాయి. అది ఎలాగో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
అన్ని టీమ్స్‌లో నలుగురు ఫారెన్ ప్లేయర్లు, మిగతా వాళ్లంతా ఇండియన్ ప్లేయర్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటారు. తమ ప్లేయింగ్ ఎలెవన్ స్ట్రాంగ్‌గా ఉండేందుకు కొన్ని టీమ్స్ ఇండియన్ క్రికెటర్లపై ఎక్కువగా ఆధారపడుతాయి. కొన్ని టీమ్స్ ఫారెన్ స్టార్ ప్లేయర్లను తమ టీమ్‌లోకి తీసుకుని.. టీమ్‌ను స్ట్రాంగ్ చేసుకుంటాయి. కానీ, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ ఇందుకు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక వైపు ఫారెన్ ప్లేయర్లను కొంటూ టీమ్‌ను స్ట్రాంగ్‌గా చూసుకుంటూనే.. మరోవైపు యంగ్ టాలెంటెడ్ ఇండియన్ క్రికెటర్లను తీసుకుని వాళ్లను సానబెడుతూ.. వారి టీమ్స్ కోసం వాళ్లను తయారు చేసుకంటూ ఉంటాయి. యంగ్ టాలెంట్‌ను గుర్తించడంతో పాటు వారికి అవసరమైన టైమ్‌ను ఇస్తూ ఉంటాయి.
రాజస్థాన్ రాయల్స్‌లో సంజు శాంసన్, రియాన్ పరాగ్ లాంటి ఆటగాళ్లకు ఆ జట్టు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. వారి బ్యాడ్ టైమ్‌లో కూడా వారిని బ్యాక్‌అప్ చేసింది. వారి మంచి ట్రైనింగ్ ఇప్పించి.. అద్భుతంగా మల్చుకుంది. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ కూడా చేసింది. ఎక్కువ ఫారెన్ ప్లేయర్లపై ఆధారపడుతుంది, టీమిండియాలోని స్టార్ ఆటగాళ్లపై దృష్టి పెట్టదు అని ఎస్‌ఆర్‌హెచ్‌పై విమర్శలు ఉన్నా.. అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ లాంటి యంగ్ టాలెంట్‌ను గురించి.. వారిని టీమ్‌తోనే అంటిపెట్టుకుని ఉంది. శాంసన్, పరాగ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్‌పై ఇన్ని ఏళ్లు వాళ్లు పెట్టిన శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కుతుంది. భవిష్యత్తులో వీళ్లు మరింత అద్భుతంగా ఆడి.. ఆ టీమ్స్‌కు ప్రధాన బలం కానున్నారు. అలాగే.. టీమిండియాకు ఎంపికై.. దేశాన్ని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్ల గల సత్తా కూడా ఈ నలుగురు ఆటగాళ్లకు ఉంది. ఇలా యంగ్ ఇండియన్ టాలెంట్‌ను గుర్తించడమే కాకుండా.. వారిని ఏళ్లుగా టీమ్‌తోనే ఉంచుకుంటూ.. టఫ్ టైమ్‌లో వారిని బ్యాక్ చేస్తూ.. ఇండియాకు మంచి క్రికెటర్లను అందిస్తున్నాయి ఆర్‌ఆర్, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We need to appreciate franchises like Hyderabad & Rajasthan Royals franchise for backing Young Indian talent like Abhishek Sharma, Abdul Samad, Riyan Parag and Sanju Samson in tough times.
Finally they are getting the fruits and they deserve this successpic.twitter.com/h7Hvmymrqq
— Sujeet Suman (@sujeetsuman1991) May 19, 2024