iDreamPost
android-app
ios-app

రిలీజ్ కి ముందే OTT డీల్ ఫిక్స్.. రాజ్ తరుణ్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Raj Tarun Bhale Unnade Movie OTT Deal: పక్కింటి కుర్రాడు, టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా చేసిన భలే ఉన్నాడే మూవీ థియేటర్లలో రిలీజ్ కంటే ముందే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకుంది. ఆ వివారాలు ఏంటో చూద్దాం.

Raj Tarun Bhale Unnade Movie OTT Deal: పక్కింటి కుర్రాడు, టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా చేసిన భలే ఉన్నాడే మూవీ థియేటర్లలో రిలీజ్ కంటే ముందే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకుంది. ఆ వివారాలు ఏంటో చూద్దాం.

రిలీజ్ కి ముందే OTT డీల్ ఫిక్స్.. రాజ్ తరుణ్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పాన్ ఇండియా లెవల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే తెలుగులో కూడా పెద్ద పెద్ ఓటీటీలు పుట్టుకొచ్చాయి. ఎందుకంటే ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంది. అలాగే ఓటీటీలు తమ హవా చూపించుకోవడానికి.. మంచి మంచి సినిమాలను కొనుగోలు చేసి వారి సబ్ స్క్రైబర్స్ ని పెంచుకుంటూ ఉంటాయి. అలా అందరి కంటే ముందుగా మంచి మూవీస్ తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలని డీల్ చేసుకుంటూ కొన్నిసార్లు మూవీ రిలీజ్ కి ముందే రైట్స్ కొనుగోలు చేస్తుంటాయి. అలా తాజాగా ఒక ఓటీటీ రాజ్ తరుణ్ హీరోగా చేసిన మూవీ రిలీజ్ కి ముందే ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసింది.

ఆ మూవీ మరేదో కాదు.. రాజ్ తరుణ్ హీరోగా నటించిన భలే ఉన్నాడే చిత్రం. ఈ మూవీ ఇంకా థియేటర్లలో విడుదల కాలేదు.. ఇంకా ఎంత మంచి బాగా ఆడుతుందో తెలీదు.. కానీ, ఓటీటీ ప్లాట్ ఫామ్ మాత్రం రైట్స్ కొనేసింది. అయితే ఆ మూవీకి వచ్చిన రెస్పాన్స్, ఆ మూవీ కథ మీద వారికి ఉన్న నమ్మకం అని చెప్పచ్చు. ముందే డీల్ ఫిక్స్ చేసుకున్నారు అంటే కచ్చితంగా భలే ఉన్నాడే మూవీ బాగుండి ఉంటుందని ఆడియన్స్ కూడా అనుకోవడం మొదలు పెట్టారు. ఇలా ముందే డీల్ ఫిక్స్ కావడం ఆ మూవీపై అంచనాలను కూడా పెంచేస్తుంది. అది మూవీకి చాలా మంచి పాజిటివ్ అంశం అనే చెప్పాలి.

మరి.. ఆ భలే ఉన్నాడే మూవీని కొనుగోలు చేసింది మరేదో ప్లాట్ ఫామ్ కాదు.. ఈటీవీ విన్ అంటున్నారు. విడుదలకు ముందే భలే ఉన్నాడే మూవీని ఈటీవీ విన్ కొనుగోలు చేసినట్లు ఓటీటీ వర్గాల్లో టాక్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే మంచి ఫ్యాన్సీ రేటుకు భలే ఉన్నాడే చిత్రాన్ని ఈటీవీ విన్ కొనుగోలు చేసిందని గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ వార్త మూవీకి మంచి బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. అలాగే ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఆ టాకే ఓటీటీ డీల్ కి ప్లస్ అయ్యింది అంటున్నారు.

ఇంక ఈ మూవీలో చాలా మందే స్టార్స్ ఉన్నారు. హోరీగా రాజ్ తరుణ్ చేస్తుంటే.. అతడి సరసన మనీషా కంద్కూర్ హీరోయిన్ గా చేస్తోంది. అంతేకాకుండా ప్రముఖ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాసరావు కీలక పాత్రలో నటిస్తున్నారు. డైరెక్టర్ మారుతి ఈ మూవీకి ప్రెజెంటర్ గా ఉన్నారు. ఈ మూవీలో అమ్మాయిలను అందంగా అలంకరించే పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. హీరోహీరోయిన్ ఇద్దరూ ఆలోచన, వ్యక్తిత్వాల్లో భిన్న ధృవాలుగా ఉంటారు. అలాంటి వాళ్లు ఎలా ప్రేమలో పడ్డారు? వారి రిలేషన్ అసలు కంటిన్యూ అయ్యిందా? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో వస్తోందో ఈ భలే ఉన్నాడే మూవీ.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş