iDreamPost

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌! వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు తప్పని ముప్పు

  • Published Sep 30, 2023 | 4:32 PMUpdated Sep 30, 2023 | 4:32 PM
  • Published Sep 30, 2023 | 4:32 PMUpdated Sep 30, 2023 | 4:32 PM
క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌! వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు తప్పని ముప్పు

క్రికెట్‌ అభిమానులంతా ప్రస్తుతం వరల్డ్‌ కప్‌ మానియాలో ఉన్నారు. అక్టోబర్‌ 5 నుంచి అధికారికంగా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు కానున్న విషయం తెలిసందే. కానీ, అంతకంటే ముందే.. ప్రపంచంలోని టీమ్స్‌ అన్ని వరల్డ్‌ కప్‌ కోసం ఇండియాలో దిగిపోవడం, వామప్‌ మ్యాచ్‌లకు సిద్ధం అవుతుండటంతో.. దేశవ్యాప్తంగా వరల్డ్‌ కప్‌ హడావిడి మొదలైపోయిందనే చెప్పాలి. 2011 తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఇండియాలో వరల్డ్‌ కప్‌ ట్రోర్నీ జరుగుతోంది. దీంతో క్రికెట్‌ అభిమానులు అసలుసిసలైన వన్డే క్రికెట్‌ మజాను పొందేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఓ విషయం కంగారు పెడుతోంది.

అదేంటంటే.. వర్షం. ఎస్‌.. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం మన దేశంలో వర్షాకాల నడుస్తుండటంతో.. మ్యాచ్‌ జరిగే ప్రదేశాల్లో సైతం వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖలు పేర్కొంటున్నాయి. ఈ రోజు భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య గౌహతిలో జరగాల్సిన వామప్‌ మ్యాచ్‌, ఆస్ట్రేలియా-నెథర్లాండ్స్‌ మధ్య తిరువనంతపురంలో జరగాల్సిన వామప్‌ మ్యాచ్‌ ఇంకా ఆరంభం కాలేదు. ఆ రెండు చోట్ల భారీ వర్షంతో మ్యాచ్‌ల నిర్వహణకు అంతరాయం కలుగుతోంది.

అయితే.. ఈ అంతరాయం కేవలం వామప్‌ మ్యాచ్‌లకే కాకుండా వరల్డ్‌ కప్‌ టోర్నీలోని ప్రధాన మ్యాచ్‌లకు సైతం కలిగే ప్రమాదం ఉండటంతో క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్‌ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. పెద్ద టీమ్స్‌ కూడా చిన్న జట్ల చేతిలో షాక్‌ తినే ప్రమాదాలు ఉంటాయి. మ్యాచ్‌లు రద్దు అయినా కూడా పెద్ద టీమ్స్‌కు దెబ్బ అనే చెప్పాలి. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌ 2023 మ్యాచ్‌లకు కూడా వర్షం ఎలా దారుణంగా అంతరాయం కలిగించిందో మనం చూశాం. ఇప్పుడు వరల్డ్‌ కప్‌పై కూడా వరుణదేవుడు కరుణచూపకపోతే.. మ్యాచ్‌లు సరిగ్గా జరగకా, ఫ్యాన్స్‌కు మ్యాచ్‌లు చూసే అవకాశం ఉండకా.. వరల్డ్‌ కప్‌ మజా మిస్‌ అయ్యే ప్రమాదం ఉంది. మరి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు వర్ష గండం ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోనిని కొట్టేవాడే లేడు! గంభీర్‌ నుంచి బిగ్‌ స్టేట్‌మెంట్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి