iDreamPost

నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు

  • Published Nov 16, 2023 | 12:11 PMUpdated Nov 16, 2023 | 12:11 PM

నిరుద్యోగులకు భారతీయ రైల్వే సంస్థ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు కల్పించనుంది. ఎన్ని పోస్టులున్నాయి.. విద్యార్హతలు ఏంటి అన్న వివరాలు ఇక్కడ మీ కోసం..

నిరుద్యోగులకు భారతీయ రైల్వే సంస్థ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు కల్పించనుంది. ఎన్ని పోస్టులున్నాయి.. విద్యార్హతలు ఏంటి అన్న వివరాలు ఇక్కడ మీ కోసం..

  • Published Nov 16, 2023 | 12:11 PMUpdated Nov 16, 2023 | 12:11 PM
నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు

దేశంలోనే అత్యధిక మంది ఉద్యోగులున్న సంస్థగా భారతీయ రైల్వే రికార్డు సృష్టించింది. ప్రతి ఏటా లక్షల మందిని రిక్రూట్‌ చేసుకుంటూ ఉంటుంది. వీరిలో 10వ తరగతి మొదలు.. డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి విద్యార్హతల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఈ క్రమంలో తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే ఇండియన్‌ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పైగా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు కల్పించనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మరి పోస్టుల వివరాలు ఏంటి.. ఎవరు అర్హులు.. అప్లై తేదీ వంటి వివరాలు ఇక్కడ మీ కోసం..

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుసగా శుభవార్తలు చెబుతోంది. ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా రైల్వేలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కొంకణ్‌రైల్వేలో ట్రైనీ అప్రెంటీస్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది రైల్వే బోర్డు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ konkanrailway.comని సందర్శించి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2023. అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని వెల్లడించింది.

అర్హతలు

ఇక కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌లో 190 ఖాళీగా ఉన్న ట్రైనీ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన డిప్లొమా చేసి ఉండాలి అని వెల్లడించింది

వయస్సు..

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుందని తెలిపింది.

ఎంపిక ప్రక్రియ..

దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత.. విద్యార్హతల ప్రకారం అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం పిలుస్తారు. ఆ తర్వాత అభ్యర్థులను సెలక్ట్‌ చేస్తారు.

ఇక చివరగా క్యాంపెయిన్ కింద గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,000 స్టైఫండ్ ఇవ్వబడుతుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. డిప్లొమా అప్రెంటీస్‌ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,000 స్టైఫండ్‌ ఇస్తారు. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్‌ను సందర్శించి.. మీకున్న అర్హతలను బట్టి పోస్టులకు అప్లై చేసుకోవాలని వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి