iDreamPost
android-app
ios-app

Mrunal Thakur: దెయ్యం మూవీలో మృణాల్ ఠాకూర్? ఆ హర్రర్ సిరీస్ లో..

  • Published Jun 08, 2024 | 6:45 PM Updated Updated Jun 08, 2024 | 6:45 PM

మృణాల్ కు ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ సూపర్ హిట్ దెయ్యం సిరీస్ లో నటించాల్సిందిగా ఏకంగా హీరోనే ఆమెను అడిగాడట. మరి ఇంతకీ ఆ మూవీ ఏది? ఆ హీరో ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

మృణాల్ కు ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ సూపర్ హిట్ దెయ్యం సిరీస్ లో నటించాల్సిందిగా ఏకంగా హీరోనే ఆమెను అడిగాడట. మరి ఇంతకీ ఆ మూవీ ఏది? ఆ హీరో ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jun 08, 2024 | 6:45 PMUpdated Jun 08, 2024 | 6:45 PM
Mrunal Thakur: దెయ్యం మూవీలో మృణాల్ ఠాకూర్? ఆ హర్రర్ సిరీస్ లో..

మృణాల్ ఠాకూర్.. ‘సీతారామం’ అనే ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంలో ఆమె చేసిన సీత పాత్ర ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయింది. ఆ తర్వాత నానితో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ఆకట్టుకుంది. అయితే హ్యాట్రిక్ హిట్ పడుతుంది అనుకున్న టైమ్ లో విజయ్ దేవరకొండతో చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ తీవ్ర నిరాశపరిచింది. దీంతో కథల ఎంపికలో కాస్త వేగం తగ్గించింది ఈ బ్యూటీ. ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మృణాల్ కు ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ సూపర్ హిట్ దెయ్యం సిరీస్ లో నటించాల్సిందిగా ఏకంగా హీరోనే ఆమెను అడిగాడట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సినిమా ఇండస్ట్రీలో దెయ్యం బేస్డ్ హార్రర్ కథలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు సైతం సూపర్ హిట్ చేస్తారు. అందుకే చాలా మంది డైరెక్టర్లు ఇలాంటి స్టోరీలకు సీక్వెల్స్ ప్లాన్స్ చేస్తుంటారు. అలా హర్రర్ సిరీస్ ల్లో ట్రెండ్ సెట్ చేసింది రాఘవ లారెన్స్ నటించిన ‘కాంచన’ మూవీ. మునితో స్టార్ట్ అయ్యి.. కాంచన 3 చిత్రాలతో ప్రేక్షకులను భయపెట్టడంతో సక్సెస్ అయ్యాడు లారెన్స్. ఇక ఇప్పుడు కాంచన 4తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా నటించాల్సిందిగా లారెన్స్ ఆమెను అప్రోచ్ అయ్యాడని టాక్. స్టోరీ నెరేషన్ కూడా పూర్తైనట్లు సమాచారం. ఆమె ఆన్సర్ కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ముని, కాంచన సినిమాల్లో కథానాయికలకు అంత స్కోప్ ఉండదు. గతంలో వేదిక, తాప్సీ లాంటి హీరోయిన్లకు ఇది అనుభవమే. దాంతో ఈ మూవీ చేయడానికి మృణాల్ ఒప్పుకుంటుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం హిందీలో ‘పూజా మేరీ జాన్’ అనే చిత్రం చేసింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో మృణాల్ ను తీసుకోనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.  కాగా.. రెగ్యూలర్ ఫార్ములాను పక్కనపెట్టి ఈసారి కాంచన 4కు లారెన్స్ కొత్త టచ్ ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2025లో విడుదల చేయడానికి టార్గెట్ పెట్టున్న ఈ చిత్రానికి గత సిరీస్ కంటే బడ్జెట్ రెండింతలు ఎక్కువేనట. మరి కాంచన సిరీస్ లో మృణాల్ నటిస్తే.. ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom