Aditya N
బాలీవుడ్ నటి రాధిక ఆప్టే టాలీవుడ్ పరిశ్రమ గురించి చాలా వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆమె పై మండిపడుతున్నారు.
బాలీవుడ్ నటి రాధిక ఆప్టే టాలీవుడ్ పరిశ్రమ గురించి చాలా వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆమె పై మండిపడుతున్నారు.
Aditya N
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే గతంలో తెలుగు సినిమా పరిశ్రమ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి వివాదాలకు కారణం అయ్యారు. గతంలో ఓ టాలీవుడ్ సీనియర్ హీరో తనను ఇబ్బంది పెట్టాడని వ్యాఖ్యానించి పెద్ద దుమారమే లేపారు. తెలుగు ఇండస్ట్రీ పై హీనంగా మాట్లాడిన ఆమె ఇప్పుడు మళ్లీ తెర పైకి వచ్చారు. రాధికా తాజా ఇంటర్వ్యూ నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇతర సినీ పరిశ్రమ అభిమానులు తెలుగు చిత్ర పరిశ్రమ పై బురద జల్లేందుకు ఈ వీడియోను వాడుతున్నారు.
ఇంతకీ ఆ వీడియోలో, రాధికా ఏం మాట్లాడింది అంటే…“ నేను చాలా కష్టపడిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో మగవారికే ప్రాధాన్యత ఉంటుంది. మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆడవారిని ట్రీట్ చేసే పద్ధతి అసలు భరించలేని విధంగా ఉంటుంది. సినిమాల్లో కూడా హీరోను దేవుడిలాగా చూడడం వరకే వారి పాత్ర పరిమితమవుతుంది. సెట్స్‌లో కూడా హీరోయిన్లను సరిగా ట్రీట్ చేయరు. హీరోలను మాత్రం ఎవరూ ఏమీ అడగరు. పైగా హీరోల మూడ్‌ను బట్టే అందరూ ప్రవర్తిస్తారు. అక్కడ నేను చాలా కష్టపడ్డాను. అందుకే అక్కడ పని చేయడం ఆపేసాను ” అని అన్నారు.
ఇక రాధికా అప్టే వ్యాఖ్యలు వైరల్ అయిన తరువాత సోషల్ మీడియాలో తెలుగు సినిమా అభిమానులు ఆమె పై మండి పడ్డారు. టాలీవుడ్‌లో చాలా మంది నటీమణులు ఉన్నారని, వారు పరిశ్రమలో హాయిగా ఉంటూ సంతోషంగా సినిమాలు చేస్తున్నారని, అయితే రాధికా ఆప్టే కేవలం పబ్లిసిటీ కోసం తాను చేయగలిగినదంతా చేస్తుందని వారు ఎత్తి చూపుతున్నారు. అయితే ఆమె కేవలం తన అనుభవం గురించి చెప్పిందని, అందులో తప్పు ఏమీ లేదని కొందరు రాధికా ఆప్టేకు మద్దతుగా నిలిచారు. రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర 1&2, ధోనీ, లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించారు. ఈ వివాదం ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.