iDreamPost
android-app
ios-app

Rachin Ravindra: కేన్‌ మామకి రచిన్ షాక్.. పుసుక్కున అంత మాట అనేశాడేంటి?

  • Published Feb 07, 2024 | 9:13 PM Updated Updated Feb 07, 2024 | 9:13 PM

న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్రా.. ఆ జట్టు సీనియర్‌ స్టార్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్సన్‌కు ఊహించని షాకిచ్చాడు. ఆ కామెంట్‌ వింటే.. మీరు కూడా అదేంటి ఇలా అనేశాడు అని అనుకుంటారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్రా.. ఆ జట్టు సీనియర్‌ స్టార్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్సన్‌కు ఊహించని షాకిచ్చాడు. ఆ కామెంట్‌ వింటే.. మీరు కూడా అదేంటి ఇలా అనేశాడు అని అనుకుంటారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 07, 2024 | 9:13 PMUpdated Feb 07, 2024 | 9:13 PM
Rachin Ravindra: కేన్‌ మామకి రచిన్ షాక్.. పుసుక్కున అంత మాట అనేశాడేంటి?

భారత సంతతికి చెందిన న్యూజిలాండ్‌ యువ క్రికెటర్‌ రచిన్‌ రవీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుత ప్రదర్శనతో భారత క్రికెట్‌ అభిమానులకు సుపరిచితుడే. పైగా అతను భారత సంతతికి చెందిన కుర్రాడు కావడంతో.. మన క్రికెట్‌ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. అయితే.. తాజాగా ఈ కుర్రాడు టెస్టుల్లో తొలి డబుల్‌ సెంచరీ బాదాడు. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌ సీనియర్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌కు షాకిచ్చాడు. అసలు విషయం ఏంటో వివరంగా తెలుసుకుందాం!

న్యూజిలాండ్‌-సౌతాఫ్రికా మధ్య ఈ నెల 4న ప్రారంభమైన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ బుధవారంతో ముగిసింది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ జట్టు 281 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 511 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కివీస్‌ ఓపెనర్లు లాథమ్‌, కాన్వె త్వరగా అవుటైనా.. కేన్‌ విలియమ్సన్‌, రచిన్‌ రవీంద్రా అద్బతంగా ఆడి భారీ స్కోర్‌ అందించాడు. కేన్‌ మామ​ 289 బంతుల్లో 16 ఫోర్లతో 118 పరుగులు చేశాడు. రచిన్‌ రవీంద్రా 366 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్సులతో 240 పరుగులు చేసి.. తన కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీని నమోదు చేశాడు. దీంతో.. 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా న్యూజిలాండ్‌కు 511 పరుగుల స్కోర్‌ వచ్చిందంటే.. కేన్‌, రచిన్‌ వల్లే.

ఇక సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌట్‌ చేసిన న్యూజిలాండ్‌.. రెండో ఇన్నింగ్స్‌కు బరిలోకి దిగింది. ఈ సారి కూడా కేన్‌ మామ సెంచరీతో అదరగొట్టాడు. 132 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 109 పరుగులు చేశాడు. 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి.. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. సౌతాఫ్రికాను రెండో ఇన్నింగ్స్‌లో 247 రన్స్‌కు ఆలౌట్‌ చేసి.. 218 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కేన్‌ విలియమ్సన్‌, రచిన్‌ రవీంద్రాలో ఎవరికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును ఇస్తారనే సస్పెన్స్‌ నెలకొంది. చివరికి రచిన్‌ రవీంద్రాకు అవార్డు ఇచ్చారు. అయితే.. ఈ అవార్డును రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలో రాణించిన కేన్‌ విలియమ్సన్‌తో పంచుకుంటావా? అని రచిన్‌ను ప్రజెంటర్‌ ప్రశ్నిస్తే.. అస్సలు పంచుకోనని, కేన్‌కు 31 సెంచరీలు ఉన్నాయని, తనకు ఇదే తొలి డబుల్‌ సెంచరీ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ విధంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు పంచుకోనంటూ కేన్‌ మామకు రచిన్‌ షాకిచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.