వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి ముందే.. భీకర ఫామ్ లో ఉంది సౌతాఫ్రికా టీమ్. ఇక అదే జోరును వరల్డ్ కప్ లో సైతం చూపిస్తోంది. తొలి మ్యాచ్ లోనే శ్రీలంకపై రికార్డు స్కోర్ సాధించి తన సత్తా ఏంటో మరోసారి ప్రపంచ కప్ జట్లకు తెలియపరిచింది. ఈ మ్యాచ్ లో లంకపై విజయం సాధించిన ప్రోటీస్ టీమ్.. అదే జోష్ ను ఆసీస్ పై కూడా చూపుతోంది. తాజాగా లక్నో వేదికగా సౌతాఫ్రికా-ఆసీస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ వరసగా రెండో సెంచరీతో చెలరేగాడు. దీంతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది సఫారి టీమ్. ఇక చివరి వరల్డ్ కప్ లో రెచ్చిపోయి ఆడుతున్నాడు డికాక్. లంకపై శతకంతో చెలరేగిన అతడు.. కంగారూలను సైతం కాంగారెత్తిస్తున్నాడు.
క్వింటన్ డికాక్.. 2023 వరల్డ్ కప్ తన చివరిదని, రిటైర్మెంట్ గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసారైనా సౌతాఫ్రికాకు తొలి వరల్డ్ కప్ తీసుకురావాలన్న ధ్యేయంతో టీమిండియాలో అడుగుపెట్టింది సఫారి టీమ్. అందుకు తగ్గట్లుగానే వరల్డ్ కప్ లో అదరగొడుతోంది. తొలి మ్యాచ్ లో రికార్డు స్కోర్ సాధించడమే కాకుండా ముగ్గురు ప్లేయర్లు సెంచరీలతో చెలరేగారు. అందులో క్వింటన్ డికాక్ కూడా ఒకడు. చివరి వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్నాడు ఈ సఫారి బ్యాటర్.
తాజాగా ఆసీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీతో ఆసీస్ బౌలర్లను చితక్కొట్టాడు. 91 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో సెంచరీ పూర్తి చేశాడు డికాక్. సిక్స్ తో డికాక్ తన శతకాన్ని కంప్లీట్ చేయడం విశేషం. దీంతో వరల్డ్ కప్ లో వరుసగా రెండు సెంచరీలు బాది ప్రత్యర్థి జట్లకు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశాడు సఫారి బ్యాటర్. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో డికాక్ 106 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 5 సిక్స్ లతో 109 పరుగులు చేసి మాక్స్ వెల్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కెప్టెన్ బవుమాతో కలిసి తొలి వికెట్ కు 108 పరుగులు జోడించాడు. ప్రస్తుతం 37 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 214 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా జట్టు. మరి వరసగా సెంచరీలు సాధించి.. వరల్డ్ కప్ లో డేంజరస్ బ్యాటర్ గా మారుతున్న డికాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
BACK TO BACK HUNDREDS BY QUINTON DE KOCK….!!!
What a knock by Quinton – a World Cup century against Australia. He started his final World Cup in some style, what a talent! pic.twitter.com/dDOIgYeF56
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 12, 2023