iDreamPost
android-app
ios-app

వీడియో: స్ట్రీట్ క్రికెట్‌లా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్! బౌలర్‌ నిలబడి త్రో వేస్తూ..!

  • Published Mar 02, 2024 | 4:36 PMUpdated Mar 02, 2024 | 4:36 PM

Usman Tariq: పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రోజుకో విచిత్రం జరుగుతోంది. ఫిక్సింగ్‌ ఆరోపణలు, ఫుడ్‌ పాయిజనింగ్‌.. ఇప్పుడు ఓ బౌలర్‌ యాక్షన్‌ ఇల్లీగల్‌ అంటూ దారుణమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Usman Tariq: పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రోజుకో విచిత్రం జరుగుతోంది. ఫిక్సింగ్‌ ఆరోపణలు, ఫుడ్‌ పాయిజనింగ్‌.. ఇప్పుడు ఓ బౌలర్‌ యాక్షన్‌ ఇల్లీగల్‌ అంటూ దారుణమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Mar 02, 2024 | 4:36 PMUpdated Mar 02, 2024 | 4:36 PM
వీడియో: స్ట్రీట్ క్రికెట్‌లా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్! బౌలర్‌ నిలబడి త్రో వేస్తూ..!

ఇప్పటికే ఫిక్సింగ్‌ ఆరోపణలు, ఫుడ్‌ పాయిజన్‌తో పరువుపోగొట్టుకుంటున్న పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను క్రికెట్‌ అభిమానులు తాజాగా మరింత దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. కరాచీ కింగ్స్‌, క్వాట్టా గ్లాడియేటర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బౌలర్‌ యాక్షన్‌ లీగల్‌ కాదంటూ.. అతన్ని లీగ్‌లోకి ఎలా తీసుకున్నారంటూ.. అసలు ఈ పీఎస్‌ఎల్‌ గల్లీ క్రికెట్‌ను తలపిస్తోందంటూ ఫ్యాన్స్‌ దారుణంగా ట్రోలింగ్‌కి దిగారు. అసలింతకీ ఏం జరిగిందంటే.. కరాచీ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో క్వాట్టా గ్లాడియేటర్స్‌ మిస్టరీ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారింది. గురువారం మ్యాచ్‌లో ఉస్మాన్ ఒకే ఓవర్‌లో ఇద్దరు బ్యాటర్లను అవుట్‌ చేశాడు.

కరాచీ స్టార్‌ బ్యాటర్లు టిమ్‌ సిఫర్ట్‌, జెమ్స్‌ విన్సీలను ఒకే ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేశాడు. ఒకే ఓవర్‌లో రెండు మంచి వికెట్లు తీయడంతో ఏ బౌలరైనా ఫుల్‌ హ్యాపీ అవుతాడు అలాగే ఉస్మాన్‌ కూడా మస్త్‌ ఖుష్‌ అయ్యాడు. కానీ, అతని బౌలింగ్‌ యాక్షన్‌ చూసిన వాళ్లే షాక్‌ అవుతున్నారు. సాధారణ ప్రేక్షకులతో పాటు, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా అతని బౌలింగ్‌ యాక్షన్‌ చూసి ఆశ్చర్యపోయారు. అంతెందుకు.. క్వాట్టా గ్లాడియేటర్స్‌ మెంటర్‌ ది గ్రేట్‌ వివిఎన్‌ రిచర్డ్స్‌ కూడా తన సొంత టీమ్‌ బౌలర్‌ బౌలింగ్‌ చూసి.. ఇదేం బౌలింగ్‌రా బాబు అన్నట్లు పేస్‌ పెట్టాడు. ఉస్మాన్‌ బౌలింగ్‌ యాక్షన్‌తో పాటు అతని బౌలింగ్‌ చూసి రిచర్డ్స్‌ ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నిలబడి త్రో బౌలింగ్‌ చేస్తున్నట్లుగా.. బాల్‌ రిలీజ్‌ చేసే టైమ్‌లో ఒక్కసారి అలా ఆగి అతను బాల్‌ వేస్తున్నాడు. అతను అలా ఒక్కసారిగా స్ట్రాక్‌ అవుతుండంతో బ్యాటర్లు కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. దీంతో.. సోషల్‌ మీడియాలో ఈ మిస్టరీ స్పిన్నర్‌ను త్రో బౌలర్‌, నాట్‌ లీగల్‌ యాక్షన్‌ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్‌ తారిఖ్‌ 4 ఓవర్లు బౌలింగ్‌ వేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి.. 2 వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కరాచీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను క్వాట్టా గ్లాడియేటర్స్‌ కూడా సరిగ్గా 20 ఓవర్లలో ఛేదించింది. 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ చివరి బాల్‌కు విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో క్వాట్టా మిస్టర్‌ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి