iDreamPost

Pushpa : ముందే వచ్చి మంచి పని చేసిన బన్నీ టీమ్

Pushpa : ముందే వచ్చి మంచి పని చేసిన బన్నీ టీమ్

డిసెంబర్ 17 విడుదల కోసం కిందామీద పడి రిలీజ్ రోజు అవుట్ ఫుట్ విషయంలో మాటలు పడిన పుష్ప టీమ్ అంతకు మించిన గొప్ప ఫలితాన్ని ఎంజాయ్ చేస్తోంది. మూడో వారంలోకి ఎంటరవుతున్న టైంలో ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా వార్త దానికి కోరుకోని బంగారు వరంలా మారబోతోంది. ఎందుకంటే జనవరి 7 రాజమౌళి సినిమా వస్తుందనే నమ్మకంతో ఇంకెవరు ఫస్ట్ కాపీలు సిద్ధం చేసి పెట్టుకోలేదు. ఆచార్య ఇంకొంచెం వర్క్స్ పెండింగ్ ఉన్నాయట. చేతిలో పది రోజులు పెట్టుకుని వాటిని పూర్తి చేయడం అసాధ్యం అంటున్నారు. భీమ్లా నాయక్ పరిస్థితి కూడా ఇంచుమిందు ఇదేమాదిరి ఉంది. బంగార్రాజు వస్తాడా లేదా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.

ఈ పరిణామాలు చూస్తే పుష్ప ది రైజ్ పార్ట్ 1 చేసింది ముమ్మాటికి రైటే. ముఖ్యంగా ఊహించని విధంగా నార్త్ బెల్ట్ లో దీనికి భారీ కలెక్షన్లు దక్కుతున్నాయి. అపోజిషన్ లేకపోవడంతో సోలో రన్ ని బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నిజంగానే పోస్ట్ పోన్ అయితే ఇంకో వారం అదనపు సమయం దొరుకుతుంది. 7వ తేదీన తమ సినిమాను వేసుకునేందుకు ఎవరూ రెడీగా లేరు. పోనీ గంగూభాయ్ లాంటి బాలీవుడ్ మూవీని వేద్దామా అంటే అదీ కుదరదు. మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీతో దీన్ని రిస్క్ లో పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరు. సో 13న వలిమై వచ్చే దాకా 12 రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద ఎంప్టీ స్పేస్ ఉంటుంది. పుష్పకిది ఛాన్సే

ఒక్క హిందీ వెర్షన్ లోనే పుష్ప పార్ట్ 1 కెజిఎఫ్ పార్ట్ వన్ దాటేసి 50 కోట్ల మార్కును అందుకుంది. ఇంకా డ్రీం రన్ పూర్తి కాలేదు. బంగార్రాజు ఒకవేళ 14 లేదా 15 వచ్చినా పాన్ ఇండియా రిలీజ్ కాదు కాబట్టి పుష్ప తప్ప వేరొకటి నార్త్ ఆడియన్స్ కి ఆప్షన్ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ కు పుష్ప కేవలం అయిదారు కోట్ల దూరంలో మాత్రమే ఉందని ట్రేడ్ టాక్. ఇప్పుడు ఈజీగా అందుకోవచ్చు. గత ఏడాది అల వైకుంఠపురములో, ఈ ఏడాది పుష్ప పార్ట్ 1 తో రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ బన్నీ అందుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పుష్ప జోరు మళ్ళీ కంటిన్యూ అయ్యేలా ఉంది

Also Read : Bangarraju Teaser ఊరి కోసం నడుం బిగించే తాతా మనవడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి