iDreamPost
android-app
ios-app

పుష్ప నటుడు జగదీష్ అరెస్ట్.. మహిళను వేధించి..!

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు స్నేహితుడిగా నటించిన యాక్టర్ జగదీష్ బుదవారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే?

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు స్నేహితుడిగా నటించిన యాక్టర్ జగదీష్ బుదవారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే?

పుష్ప నటుడు జగదీష్ అరెస్ట్.. మహిళను వేధించి..!

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మూవీ పుష్ప. ఇందులో హీరో స్నేహితుడు కేశవ పాత్రలో నటించి మెప్పించాడు నటుడు జగదీష్. అయితే ఈ నటుడిని తాజాగా పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కేసులో ఈ నటుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పంజాగుట్ట పోలీసులు నటుడు జగదీష్ ను కోర్టులో హాజరుపరచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు పుష్ప నటుడు జగదీష్ ను పంజాగుట్ట పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అసలేం జరిగిందనే దాని మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లో నివాసం ఉండే ఓ జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్న సమయంలో నటుడు జగదీష్ గతంలో ఫోటోలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ఫోటోలను ఆ మహిళకు చూపించి జగదీష్ వేధించినట్లుగా సమాచారం. దీంతో నటుడు జగదీష్ వేధింపులు భరించలేని ఆ జూనియర్ ఆర్టిస్ట్.. గత నెల 29న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

అయితే పోలీసులు అప్పటి నుంచి ఈ కేసు విషయంలో దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అయితే, ఈ క్రమంలోనే చనిపోయిన ఆ మహిళ మరో వ్యక్తితో ఉన్న సమయంలో నటుడు జగదీష్ ఫోటోలు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆ ఫోటోలతో ఆ మహిళను వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ కారణంగానే పంజాగుట్ట పోలీసులు బుధవారం పుష్ప నటుడు జగదీష్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరి పుష్ప నటుడు అరెస్ట్ వ్యవహారంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alAlobetAlobetPiabellacasinokatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş