iDreamPost

సమాజాన్ని నిలదీసిన ఆవేశపరుడు – Nostalgia

సమాజాన్ని నిలదీసిన ఆవేశపరుడు – Nostalgia

సమాజంలో జరుగుతున్న తప్పులను, కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నిస్తూ సినిమాలు తీయాలనే ఆలోచన వినడానికి బాగానే ఉంటుంది కానీ ఆచరణ అంత సులభం కాదు. అందుకే స్టార్ హీరోలు ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా కమర్షియల్ ఫార్ములాతోనే ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. అలా కాకుండా నిజాయితీగా చెబితే స్పష్టంగా చూపిస్తే జనం ఖచ్చితంగా ఆదరిస్తానని ఋజువు చేసిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి ఓ చక్కని ఉదాహరణే 1994లో వచ్చిన బాలీవుడ్ మూవీ క్రాంతివీర్. నానాపటేకర్ ప్రధాన పాత్రలో మేహూల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్.

ఉపేంద్ర, పూరి జగన్నాధ్ లాంటి దర్శకులు పరిచయం చేసిన అగ్రెసివ్ హీరోయిజంకు స్ఫూర్తి ఒకరకంగా క్రాంతివీర్ అనే చెప్పొచ్చు. ఇందులో ప్రతాప్ తిలక్ పాత్ర విచ్చలవిడిగా ఉంటుంది. బాధ్యత లేకుండా తిరుగుతాడు. కానీ పక్కవాళ్ళకు ఏదైనా సమస్య లేదా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్లకు వాళ్ళుగా ఎలా పరిష్కరించుకోవాలో చెబుతూ ఉంటాడు. మతాల కోసం కొట్టుకుంటున్నప్పుడు హిందూ ముస్లిం రక్తం బయటికి తీసి మరీ తేడా చూపించమని నిలదీస్తాడు. ఆఖరికి సంఘవిద్రోహ శక్తులను చంపినందుకు కోర్టు తనకు ఉరిశిక్ష వేస్తే దాన్ని టీవీలో చూపించమని చెప్పి మరీ పబ్లిక్ కు హితబోధ చేస్తాడు. ఇంత డిఫరెంట్ గా ఉంటుందీ క్యారెక్టర్.

ఉత్తమ నటుడిగా నానా పటేకర్ కు క్రాంతివీర్ జాతీయ అవార్డు తీసుకొచ్చింది. క్లాసు మాస్ లేకుండా అన్ని వర్గాలు తన యాక్టింగ్ కు చప్పట్లు కొట్టారు కలెక్షన్లు ఇచ్చారు. దీన్నే తెలుగులో మోహన్ బాబు తనే హీరోగా మీనా హీరోయిన్ గా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేశారు. దాసరి కీలక పాత్ర పోషించారు. బప్పిలహరి స్వరాలు సమకూర్చగా 1995 మార్చి 23న విడుదలైన పుణ్యభూమి నా దేశం అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదు. మోహన్ బాబు ఎంత గొప్పగా నటించినా నానా పటేకర్ తో సరితూగలేకపోయారు. మేజర్ చంద్రకాంత్ తర్వాత హిట్ లేక సతమతమవుతున్న కలెక్షన్ కింగ్ ను ఇదీ నిరాశపరిచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి