iDreamPost

నాకు అవార్డు రాకుండా కుట్ర.. ఎంగిలి కూటికి ఆశ పడ్డారు: మోహన్ బాబు

  • Published Feb 09, 2024 | 5:00 PMUpdated Feb 09, 2024 | 5:00 PM

ఒకప్పటి సినీ పరిశ్రమను ముందుకు నడిపించిన వారిలో.. మంచు మోహన్ బాబు కూడా ఒకరు. అయితే, తనకు అవార్డ్స్ రానివ్వకుండా చేస్తున్నారంటూ.. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు దారి తీస్తున్నాయి.

ఒకప్పటి సినీ పరిశ్రమను ముందుకు నడిపించిన వారిలో.. మంచు మోహన్ బాబు కూడా ఒకరు. అయితే, తనకు అవార్డ్స్ రానివ్వకుండా చేస్తున్నారంటూ.. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు దారి తీస్తున్నాయి.

  • Published Feb 09, 2024 | 5:00 PMUpdated Feb 09, 2024 | 5:00 PM
నాకు అవార్డు రాకుండా కుట్ర.. ఎంగిలి కూటికి ఆశ పడ్డారు: మోహన్ బాబు

తెలుగు వారికి మోహన్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో తన డైలాగు డెలివరీతో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ స్థానాన్ని అధిరోహించేవారు ఎవరు రాలేదు. అంతలా తనకంటూ స్పెషల్ ప్లేస్ ను సంపాదించుకున్నారు మోహన్ బాబు. అందుకే తెలుగు వారంతా మోహన్ బాబును డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు అంటూ పిలుచుకుంటారు. తెలుగులో కొన్ని వందల చిత్రాలలో మోహన్ బాబు నటించారు. ఎందరో ప్రేక్షకుల అభిమానం ఆయన సొంతం. అలాగే పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు మోహన్ బాబు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించి.. అప్పటి కేంద్ర ప్రభుత్వం 2007లో పద్మశ్రీ పురస్కారంతో ఆయనను సత్కరించింది. అయితే, ఈ క్రమంలో తనకు ఎన్నో అవార్డ్స్ ను రానివ్వకుండా .. చాలా మంది అడ్డుపడుతున్నారంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు. దీనితో ప్రస్తుతం ఈ విషయం పలు కొత్త చర్చలకు దారితీస్తుంది.

మోహన్ బాబు కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలను తెలుగు ఇండస్ట్రీకి అందించారు. రాయలసీమ రామన్న చౌదరి, అసెంబ్లీ రౌడీ, అడవిలో అన్న, పెద్దరాయుడు, అల్లుడు గారు, ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు.. ఆయన కెరీర్ లో నిలిచిపోతాయి. అయితే, తనకు రావాల్సిన ఎన్నో అవార్డులను .. రానివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ .. గతంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ.. “చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు చాలా చేశాను. కానీ ఒక్క సినిమాకు కూడా అవార్డు లేదంటే.. రాకుండా చేశారు. నేను అప్లై చేశాను. రాయలసీమ రామన్న చౌదరి, పెద్దరాయుడు ఎలాంటి సినిమాలు అవి. నాకు అవార్డు రాకుండా అడ్డుపడిన వ్యక్తులు తెలుసు. వాళ్లకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పా.. థాంక్యూ సార్ నాకు అవార్డు ఇవ్వకుండా ఓ చెత్త సినిమాకు ఇచ్చారు అని చెప్పా.. అది కాదు అని ఎదో చెప్పబోయాడు. డోంట్ టాక్ టు మీ .. ఇంకా ఎంగిలి కూడుకు ఆశపడుతున్నారు.. ఇంత వయసొచ్చింది.. మీరంతా కమిటీ సభ్యులు. ఎందుకు అటువంటి పనులు చేస్తారు అని చెప్పాను”. అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు.

దీనితో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది కాకుండా ఇప్పుడు అవార్డులు, పురస్కారాలు ఇచ్చే టైం కి ఈ వార్తలు బయటకు రావడం .. వైరల్ అవ్వడంతో.. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి. ఇక మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలకు పలువురు మోహన్ బాబు డేర్ కు హ్యాట్సాఫ్ అంటూ .. కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు అడపా దడపా ఏవో ఒక చర్చలతో సామజిక మాధ్యమాలలో కనిపిస్తూ ఉన్నారు. మరి, మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి