iDreamPost
android-app
ios-app

పూణే యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్.. డ్రైవింగ్ చేసింది నేనే అంటున్న డ్రైవర్!

పూణే యాక్సిడెంట్ కేసులో మైనర్ బాలుడు ప్రస్తుతం అబ్జర్వేషన్ హోంలో ఉన్న సంగతి విదితమే. ఇద్దరు టెకీల చావుకు కారణమైన అతడికి.. 15 గంటల్లో బెయిల్ రావడంపై విమర్శలు రావడంతో బెయిల్ రద్దు చేసింది కోర్టు. అయితే

పూణే యాక్సిడెంట్ కేసులో మైనర్ బాలుడు ప్రస్తుతం అబ్జర్వేషన్ హోంలో ఉన్న సంగతి విదితమే. ఇద్దరు టెకీల చావుకు కారణమైన అతడికి.. 15 గంటల్లో బెయిల్ రావడంపై విమర్శలు రావడంతో బెయిల్ రద్దు చేసింది కోర్టు. అయితే

పూణే యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్.. డ్రైవింగ్ చేసింది నేనే అంటున్న డ్రైవర్!

దేశాన్ని కుదిపేస్తోంది పూణే ర్యాష్ డ్రైవింగ్ కేసు. తప్ప తాగి మైనర్ బాలుడు తన పోర్షే కారులో అత్యంత వేగంగా వచ్చి ఓ బైక్ ను డీకొట్టడంతో.. ఇద్దరు ఐటీ ఇంజనీర్లు స్పాట్‌లో మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఇద్దర్నీ మధ్యప్రదేశ్‌కు చెందిన వాసులుగా గుర్తించారు. అనీష్ అవధియా, అశ్వినీ కోష్ట శనివారం రాత్రి గెట్ టు గెదర్ పార్టీకి వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా.. ఆదివారం తెల్లవారు జామున పోర్షే కారు వచ్చి వీరిని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా. మైనర్ బాలుడు వేదాంత్ అగర్వాల్ కారు నడుపుతున్నాడని తేలింది. ఇటీవల ప్లస్ 2 పూర్తి కావడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చి.. మద్యం సేవించి వేగంగా ఇంటికి వెళుతూ.. ఈ ఇద్దర్నీ ఢీకొన్నాడు.

అతడు పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతానికి చెందిన బ్రహ్మా రియాల్టీకి చెందిన విశాల్ అగర్వాల్ కుమారుడు అని పోలీసులు నిర్దారించి..  అరెస్టు చేశారు. తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తికి కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది స్థానిక కోర్టు. ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని, మానసిక వైద్యుడ్ని కలిసి చికిత్స పొందాలంటూ షరతులు పెట్టింది. కాగా, నిందితుడైన మైనర్‌కు బెయిల్ మంజూరు కావడంపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. దీంతో బెయిల్ రద్దు చేసింది కోర్టు. వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని పేర్కొంది. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్టు నెలకొంది. ఇప్పటి వరకు ఈ హత్యలను చేసింది మైనర్ అన్న వార్తలు వినిపించాయి. ఇప్పుడు సడెన్‌గా యాక్సిడెంట్ తానే చేశానంటూ చెప్పుకొచ్చాడు డ్రైవర్.

తమ డ్రైవరే కారు నడిపాడు అంటూ విశాల్ అగర్వాల్ కూడా ఆరోపణలు చేస్తున్నాడు. కాగా, దీనిపై పూణే పోలీస్ కమీషనర్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ.. పోర్షే కారును నడిపేది బాలుడేనని, అతడు పూర్తి స్పృహలోనే ఉన్నాడని చెబుతున్నారు. 17 ఏళ్ల మైనర్ బాలుడ్ని ఈ కేసు నుండి తప్పించేందుకు డ్రైవర్‌ను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. అతడికి డబ్బు ఆశ చూపించి నేరం తనమీదకు తోసుకునేలా చేస్తున్నారని అంటున్నారు. కారు డ్రైవర్ కాదు.. మైనర్ నడుపుతున్నాడని చెప్పేందుకు మా దగ్గర వీడియో ఫుటేజీ ఉందని తెలిపారు. డ్రైవర్ ఎవరి ఒత్తిడితో ఈ ప్రకటన చేశారో అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి