iDreamPost

PSL బెస్ట్ లీగ్ అని పాక్ గొప్పలు.. ఫైనల్స్ కి మాత్రం ప్రేక్షకులు రాక!

పాకిస్తాన్ తన పరువును నిట్టనిలువునా పోగొట్టుకుంది. పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ విషయం బట్టబయలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ తన పరువును నిట్టనిలువునా పోగొట్టుకుంది. పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ విషయం బట్టబయలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

PSL బెస్ట్ లీగ్ అని పాక్ గొప్పలు.. ఫైనల్స్ కి మాత్రం ప్రేక్షకులు రాక!

ప్రపంచ క్రికెట్ లోకి ఎప్పుడైతే IPL ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. ఇక పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లుగా ఐపీఎల్ ను చూసి చాలా దేశాలు సేమ్ అలాంటి లీగ్ లనే ప్రారంభించాయి. వాటిల్లో పాకిస్తాన్ సూపర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమీయర్ లీగ్ లాంటి మరికొన్ని టోర్నీలు పుట్టుకొచ్చాయి. కానీ ఐపీఎల్ కు వచ్చినంత క్రేజ్ ను మాత్రం సంపాదించుకోలేకపోయాయి. మరీ ముఖ్యంగా పీఎస్ఎల్ గురించి గొప్పలు చెప్పుకున్న పాక్ తన ఇజ్జత్ మెుత్తం పోగొట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా తయ్యారు అయ్యింది పాకిస్తాన్ పరిస్థితి. ఐపీఎల్ ను చూసి పీఎస్ఎల్ ను ప్రారంభించింది పాక్. ఇది తమ దేశంలోనే కాక, ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న లీగ్ అంటూ స్టార్టింగ్ లో గొప్పలు చెప్పుకుంది పాక్. అయితే లీగ్ తొలినాళ్లలో మంచి ఆదరణనే సాధించింది. కానీ రానురాను ఈ లీగ్ లో గొడవలు ఎక్కువ కావడం, మ్యాచ్ లు రసవత్తరంగా సాగకపోవడంతో.. ప్రేక్షకులకు బోర్ కొట్టింది. ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. పీఎస్ఎల్ సీజన్ 9కి అభిమానులు కరువైయ్యారు. లీగ్ మ్యాచ్ లకే కాదు.. ఏకంగా ఫైనల్ మ్యాచ్ కు కూడా ప్రేక్షకులు లేక ఖాళీ సీట్లు దర్శనమిచ్చాయి.

కరాచీ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇస్లామాబాద్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ జట్టు తలపడ్డాయి. ఈ పోరులో 2 వికెట్ల తేడాతో ఇస్లామాబాద్ టీమ్ కప్ గెలుచుకుంది. అయితే ఇండియాలో రంజీ మ్యాచ్ లకు వచ్చిన ప్రేక్షకులు కూడా పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ కు రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు పాక్ పరువుతీస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పేరు గొప్ప.. ఊరుదిబ్బ అన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. అందుకే తోటోడు తొడ కోసుకుంటే.. మనం మెడకోసుకోకూడదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మ్యాచ్ కు ముందు ఖాళీ స్టేడియం మా గుండెలను బ్రేక్ చేసిందని మరికొందరు పాక్ అభిమానులు పిక్స్ షేర్ చేస్తూ తమ బాధను వ్యక్తపరిచారు. మరి పీఎస్ఎల్ నిర్వహణపై, ఇంత దారుణంగా అట్టర్ ఫ్లాప్ కావడంపై పాక్ గొప్పలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024.. SRHకి బిగ్ షాక్! ఆ ప్లేయర్ నిర్ణయంతో కొంపమునిగింది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి