iDreamPost
android-app
ios-app

వీడియో: గ్రౌండ్ లో స్టార్ ప్లేయర్లకు ప్రమాదం.. బలంగా ఢీ కొట్టుకోవడంతో..!

  • Published Feb 29, 2024 | 8:11 AM Updated Updated Feb 29, 2024 | 8:11 AM

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో ఇద్దరు ఆటగాళ్లు బలంగా ఢీకొన్నారు. దీంతో..

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో ఇద్దరు ఆటగాళ్లు బలంగా ఢీకొన్నారు. దీంతో..

వీడియో: గ్రౌండ్ లో స్టార్ ప్లేయర్లకు ప్రమాదం.. బలంగా ఢీ కొట్టుకోవడంతో..!

ప్రతీ క్రికెటర్ గ్రౌండ్ లోకి దిగిన తర్వాత వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టడానికే ప్రయత్నిస్తాడు. చివరి వరకు పోరాడి జట్టుకు విజయాన్ని అందించడంమే ప్లేయర్ అంతిమ లక్ష్యం. అయితే ఈ క్రమంలో ముందు, వెనక చూసుకోకుండా బాల్ ను ఒడిసిపట్టుకోవడానికి వేగంగా పరిగెడుతూ ఉంటారు ప్లేయర్. ఇలాంటి టైమ్ లో ఊహించని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఇద్దరు స్టార్ ప్లేయర్లు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా తాజాగా కరాచీ కింగ్స్ వర్సెస్ ఇస్లామాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేయడానికి వచ్చాడు ఇస్లామాబాద్ బౌలర్ హునైన్ షా. స్ట్రైకింగ్ అప్పటికే రెచ్చిపోయి ఆడుతున్న విండీస్ వీరుడు పొలార్డ్ ఉన్నాడు. లో ఫుల్ టాస్ గా వచ్చిన ఇన్నింగ్స్ చివరి బాల్ ను పొలార్డ్ స్ట్రైట్ గా ఆడాడు. ఇక ఆ బాల్ ను అందుకోవడానికి అలెక్స్ హేల్స్, షాదాబ్ ఖాన్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి.. చూసుకోకుండా బలంగా ఢీకొన్నారు. దాంతో ఇద్దరు గ్రౌండ్ లోనే నొప్పితో పడిపోయారు. కొద్దిసేపటి వరకు వారు మైదానంలోనే నొప్పితో విలవిల్లాడారు. అనంతరం సహచర ఆటగాళ్లు, ఫిజియోలు వచ్చి వారిని పరిశీలించారు.

అయితే ఇద్దరి తలకు గాయాలు కాకపోవడంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కొద్ది సమయం తర్వాత హేల్స్, షాదాబ్ ఖాన్ కుదుటపడ్డారు. పెద్దగా ఏమీ గాయాలు కాలేదని మేనేజ్ మెంట్ తెలిపింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కారాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జట్టులో పొలార్డ్ 28 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్ తో 48 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంతరం 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యూనైటెడ్ టీమ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. ఓపెనర్ కొలిన్ మన్రో 47 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 రన్స్ చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

ఇదికూడా చదవండి: ఆ టీమిండియా లెజెండే స్ఫూర్తి.. అతడ్ని చూసి బౌలింగ్​ నేర్చుకున్నా: అండర్సన్