iDreamPost
android-app
ios-app

The Goat Life Movie: 16 ఏళ్ల తర్వాత రిలీజ్‌.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్‌ హీరో సినిమా

  • Published Feb 09, 2024 | 1:21 PM Updated Updated Feb 09, 2024 | 1:21 PM

2008లో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం ఆర్థిక కష్టాలను ఈదుతూ.. 2024లో రిలీజ్ కు సిద్దమైంది. మరి 16 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న ఆ మూవీ ఏదో చూద్దాం పదండి.

2008లో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం ఆర్థిక కష్టాలను ఈదుతూ.. 2024లో రిలీజ్ కు సిద్దమైంది. మరి 16 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న ఆ మూవీ ఏదో చూద్దాం పదండి.

The Goat Life Movie: 16 ఏళ్ల తర్వాత రిలీజ్‌.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్‌ హీరో సినిమా

ఒక సినిమా షూటింగ్ జరుపుకుని, ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎన్నో కష్టాలు దాటాలి. ఆ ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొనలేక వందల సంఖ్యలో మూవీలు ల్యాబ్స్ లోనే మగ్గుతున్నాయి. కొన్ని చిత్రాలు మాత్రం ఆ సమస్యలను అధిగమించి ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అలా ఒకటీ, రెండేళ్లు కాదు ఏకంగా 16 సంవత్సరాలు షూటింగ్ జరుపుకుని తాజాగా థియేటర్లలోకి రాబోతోంది ఓ స్టార్ హీరో సినిమా. 2008లో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం ఆర్థిక కష్టాలను ఈదుతూ.. 2024లో రిలీజ్ కు సిద్దమైంది. స్టార్ హీరో అయినప్పటికీ.. ఆ సినిమా ఎందుకు ఇన్ని సంవత్సరాలు రిలీజ్ కాలేదు? ఆ హీరో ఎవరు? ఆ మూవీ ఏది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2008లో షూటింగ్ మెుదలు పెట్టిన ఓ చిత్రం 2024లో విడుదలకు సిద్ధమైంది. దాదాపు 16 సంవత్సరాలు ఈ మూవీ షూటింగ్ జరుపుకుంది. ఇక ఈ మూవీకి అవార్డు విన్నింగ్ డైరెక్టర్ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పైగా పృథ్వీరాజ్ సుకుమార్ లాంటి స్టార్ హీరో ఇందులో నటిస్తున్నాడు. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉండటం విశేషం. ఇంతటి కాస్టింగ్ ఉన్నాగానీ.. ఈ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి 16 ఏళ్లు పట్టింది. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

‘ది గోట్ లైఫ్’ అనే సినిమాకు 2008లో సైన్ చేశాడు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఇక 2009లో ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. కానీ బడ్జెట్ కారణాల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయింది ఈ చిత్రం. అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. 1990వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ.. కేరళ నుంచి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి కథ ఈ గోట్ లైఫ్. షూటింగ్ ఆగిపోవడంతో.. పాపం ఐదారేళ్ల పాటు ప్రొడ్యూసర్స్ కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు డైరెక్టర్. ప్రయోగాత్మకమైన కథ కావడంతో.. ఏ నిర్మాత కూడా సాహసం చేయలేదు. దీంతో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటుగా హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ తో పాటుగా తాను కూడా ఓ నిర్మాతగా మారాడు. వీరు ముగ్గురు కలిసి ది గోట్ లైఫ్ మూవీని నిర్మించారు.

ఇక దీంతో ఆర్థిక కష్టాలు తొలగిపోయాయి అని సంతోషించే లోపే.. కరోనా రూపంలో వారినెత్తిపై మరోపిడుగుపడింది. దీంతో మరో రెండేళ్లు ఈ మూవీకి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నో అవాంతరాలను దాటుకుని ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంది ది గోట్ లైఫ్. ఎట్టకేలకు 2024 ఏప్రిల్ 10 థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటుగా హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీను లూయిస్, అమలాపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 10న దక్షిణాది భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ కాబోతోంది. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 16 ఏళ్లు షూటింగ్ జరుపుకున్న మూవీగా ది గోట్ లైఫ్ రికార్డు సృష్టించింది. మరి స్టార్ట్ అయిన 16 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతున్న ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Eagle Review in Telugu: రవితేజ ఈగల్‌ మూవీ రివ్యూ