iDreamPost

పృథ్వీరాజ్ ఆడు జీవితం.. రియల్ లైఫ్ హీరో ఇతనే!

Prithviraj Aadujeevitham Real Life Hero: పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం మూవీ వరల్డ్ వైడ్ గా దూసుకుపోతోంది. అయితే రియల్ లైఫ్ గోట్ మ్యాన్ ఎవరో మీకు తెలుసా? అతని కష్టమే ఈ ఆడుజీవితం సినిమా కథ.

Prithviraj Aadujeevitham Real Life Hero: పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం మూవీ వరల్డ్ వైడ్ గా దూసుకుపోతోంది. అయితే రియల్ లైఫ్ గోట్ మ్యాన్ ఎవరో మీకు తెలుసా? అతని కష్టమే ఈ ఆడుజీవితం సినిమా కథ.

పృథ్వీరాజ్ ఆడు జీవితం.. రియల్ లైఫ్ హీరో ఇతనే!

ప్రస్తుతం మలయాళం సినిమాలో పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సూపర్ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాదిలో విడుదలై కోట్లు కురిపించిన మరో మలయాళం ఫిల్మ్ అవుతుంది అంటున్నారు. ఈ సినిమాలో మేజర్ క్రెడిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ కే దక్కుతుంది. ఎందుకంటే ఆ పాత్రకు అతను ప్రాణం పోశాడు. అతను తప్పితే మరెవరూ ఆ పాత్ర చేయలేరేమో అనేలా జీవించేశాడు. అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ చేసిన పాత్ర రియల్ లైఫ్ పాత్రే అని మీకు తెలుసా? రియల్ గోట్ మ్యాన్ ఉన్నాడని మీకు తెలుసా?

ఆడుజీవితం మూవీ ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఇప్పుడు వస్తున్న రిజల్ట్ చూస్తే చిత్రబృందం పడిన 16 ఏళ్ల కష్టం అర్థమవుతుంది. ఈ సినిమా కోసం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా 16 ఏళ్లు నిరీక్షించాడు. ఇప్పుడు ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. చాలామంది ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి కష్టం నిజజీవితంలో ఎదురైతే ఎవరైనా తట్టుకోగలరా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది నిజంగా జరిగిన కథే అని చాలామందికి తెలియకపోవచ్చు. నిజ జీవితంలో జరిగిన కథనే ఇలా ఆడుజీవితంగా తెరకెక్కించారు. నిజంగానే ఒక గోట్ మ్యాన్ ఉన్నారు. దేశం కాని దేశంలో ఆయన పడిన కష్టానికి దృశ్యరూపమే ఈ ఆడుజీవితం సినిమా. 2008లో గోట్ డేస్: ఆడుజీవితం పేరిట మలయాళ రైటర్ బెన్యామిన్ ఒక నవల రాశారు. ఈ నవలను నాలుగు భాగాలుగా విభజించారు. ‘జైలు, ఎడారి, తప్పించుకోవడం, తిరస్కరణ’ అనే 4 పార్ట్స్ గా విభజించారు.

Goat life hero

ఈ ఆడుజీవితం నవలలో ఉన్న కథ కేరళకు చెందిన నజీబ్ మహ్మద్ అనే వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీ. ఇండియాలో ఉండే ఎంతోమంది మారిదిరిగానే నజీబ్ మహ్మద్ కూడా గల్ఫ్ దేశాల్లో పని చేయాలి అనుకున్నాడు. అక్కడ పని దొరికితే తన కుటుంబానికి మంచి ఆదాయం దక్కుతుంది. తన కష్టంతో కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు అని కలలు కన్నాడు. తన భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు గల్ఫ్ దేశాలకు వలస కూలీగా వెళ్లాడు. కానీ, తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు అయ్యింది. వలస కూలీగా వెళ్లిన నజీబ్ మహ్మద్ బానిసగా మారిపోయాడు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరిట జరిగే మోసాలకు నజీబ్ మహ్మద్ బలవుతాడు. తనని వేరే వ్యక్తి ఉద్యోగం పేరటి తీసుకెళ్లి ఒకరికి అమ్మేస్తాడు. అక్కడ నజీబ్ ఒక బానిసగా మారిపోతాడు.

నజీబ్ మహ్మద్ కు గొర్రెలు కాసే పని అప్పజెప్తారు. ఆ యజమాని కనీసం కడుపునిండా భోజనం కూడా పెట్టేవాడు కాదు. వేసుకోవడానికి బట్టలు ఉండవు. తినడానికి తిండి ఉండదు. గన్నుతో బెదిరిస్తూ పనులు చేయించేవాడు. పారిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారి నజీబ్ దొరికిపోయేవాడు. అతడిని తీసుకొచ్చి బెల్టుతో చావకొట్టడం మాత్రమే కాకుండా తిండి కూడా పెట్టకుండే హింసించేవాడు. మూడున్నరేళ్ల పాటు గొర్రెలు కాచుకుంటూ బతికాడు. తనని కూడా వాటిలో ఒకడిగా భావించేవాడు. గొర్రెలతో మాట్లాడుకుంటూ.. వాటితో కలిసి తింటూ ఉండిపోయాడు. పారిపోవాలి అనే ఆలోచనను వదిలేస్తాడు. అయితే పక్క ఫామ్ లో ఉండే వారితో కలిసి నజీబ్ పారిపోతాడు. అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఎవరి సాయంతో బయటపడ్డాడు? ఇండియాకి ఎలా తిరిగి వచ్చాడు? అనేదే ఆడు జీవితం పుస్తకం, సినిమాలో ఉండే కథ. మరి.. రియల్ లైఫ్ గోట్ మ్యాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి