iDreamPost
android-app
ios-app

VIDEO: ఇంగ్లండ్‌ గడ్డపై పృథ్వీ షా విధ్వంసం! కొద్దిలో రోహిత్‌ 264 రికార్డ్‌ మిస్‌

  • Published Aug 10, 2023 | 8:37 AM Updated Updated Aug 10, 2023 | 8:37 AM
  • Published Aug 10, 2023 | 8:37 AMUpdated Aug 10, 2023 | 8:37 AM
VIDEO: ఇంగ్లండ్‌ గడ్డపై పృథ్వీ షా విధ్వంసం! కొద్దిలో రోహిత్‌ 264 రికార్డ్‌ మిస్‌

టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా విధ్వంసం సృష్టించాడు. పిన్నవయసులోనే టీమిండియాలోకి రాకెట్‌లా దూసుకొచ్చిన ఈ యువ సంచనలం.. అతి తక్కువ కాలంలోనే జూనియర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అని పేరు తెచ్చుకున్నాడు. కానీ, నిలకడలేమితో ఎక్కువ కాలం టీమిండియాలో కొనసాగలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ ఆడుతున్నా.. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ ఎంత ప్రయత్నించినా మునుపటి ఫామ్‌ను చూపించలేకపోయాడు. అయితే.. ఈ సారి ఇంగ్లండ్‌ గడ్డపై తన ప్రతాపం చూపించి, ఫామ్‌ను అందుకోవాలని పట్టదలతో ఇంగ్లీష్‌ దేశానికి వెళ్లిన పృథ్వీ షా.. తన బ్యాటింగ్‌ విశ్వరూపం చూపించాడు.

తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు కిందపడి హిట్‌ వికెట్‌గా అవుటైన పృథ్వీ.. రెండో మ్యాచ్‌లో తన సత్తా ఏంటో మొత్తం ఇంగ్లండ్‌కు చూపించాడు. ఒక్క ఇన్నింగ్స్‌ ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో.. వాట్‌ ఈజ్‌ పృథ్వీ షా అనే చాటి చెప్పాడు. దెబ్బకు కౌంటీ క్రికెట్‌ రికార్డలను బద్దలు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. పరుగుల వర్షంతో పాటు.. బౌండరీల సునామీతో ఇంగ్లండ్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. బంతి పడితే బాదడమే పనిగా పెట్టుకోవడంతో.. కేవలం 153 బంతుల్లోనే 244 పరుగుల భారీ స్కోర్‌ చేశాడు. అందులో 28 ఫోర్లు, 11 సిక్సులు ఉండటం గమనార్హం. పృథ్వీషా సృష్టించిన విధ్వంసానికి నార్తాంప్టన్‌షైర్ ఏకంగా 415 పరుగులు చేసింది.

ఈ ఇన్నింగ్స్‌తో పృథ్వీ షా ఇంగ్లండ్‌ గడ్డపై లిస్ట్‌-ఏల్లో అత్యధిక స్కోర్‌ చేసిన భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే కొద్దిలో రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్‌ను మిస్‌ అయ్యాడు. వన్డేల్లో రోహిత్‌ శర్మ 264 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ రికార్డ్‌కు పృథ్వీ కేవలం 21 పరుగుల దూరంలో అవుట్‌ అయ్యాడు. పృథ్వీ షా అది బ్రేక్ చేసినా లెక్కలోకి రాదనుకోండి. ఎందుకంటే రోహిత్‌ అంతర్జాతీయ రికార్డు.

ఇకపోతే.. ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో భాగంగా మెట్రో బ్యాంక్‌ వన్డే కప్‌ టోర్నీలో నార్తాంప్టన్‌షైర్-సోమర్‌ సెట్‌ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ తొలుత బ్యాటింగ్‌ చేసి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. పృథ్వీ షా 244 రన్స్‌తో చెలరేగితే.. మిగతా బ్యాటర్లు నామమాత్రపు పరుగులు చేశారు. సామ్‌ వైట్‌మాన్‌ చేసిన 54 పరుగులే సెకండ్‌ హైఎస్ట్‌. ఇక ఈ భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సోమర్‌సెట్‌ 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో నార్తాంప్టన్‌షైర్ 87 రన్స్‌ తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.