iDreamPost

వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు

వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు

పోలీసుల ఏమరపాటు రిమాండ్ లో ఉన్న ఖైదీలు తప్పించుకోవడానికి కారణమైంది. పోలీసులు చేసిన నిర్లక్ష్యం ముగ్గురు ఖైదీలు తప్పించుకుపోయేలా చేసింది. దీంతో సంబంధిత అధికారులు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. టీ తాగడానికి వెళ్లిన పోలీసులకు ఖైదీలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఖైదీలను కోర్టుకు తరలిస్తున్న సమయంలో వ్యాన్ ను, పోలీసులు టీ తాగడం కోసం రోడ్డు పక్కన ఆపడంతో అందులో ఉన్న కొందరు ఖైదీలు వ్యాన్ నుంచి తప్పించుకుని పరార్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రైల్వే స్టేషన్ లో మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర విలువైన వస్తువులను కొట్టేస్తున్న ఏడు మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఖైదీలను ఝాన్సీ రైల్వే కోర్టుకు వ్యాన్ లో తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఖైదీలను తరలిస్తున్న క్రమంలో మార్గమద్యలో ఓ ప్రాంతంలో వ్యాన్ ను రోడ్డు పక్కను నిలిపి ఉంచి చాయ్ తాగేందుకు పోలీసులు వెళ్లారు. దీంతో వ్యాన్ వద్ద గస్తీ పోలీసులు ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన ముగ్గురు ఖైదీలు వ్యాన్ నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయారు.

ఖైదీలు వ్యాన్ నుంచి పరార్ అవుతున్న దృష్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా పారిపోయిన రిమాండ్‌ ఖైదీలను 27 ఏళ్ల బ్రిజేంద్ర, 20 ఏళ్ల శైలేంద్ర, 23 ఏళ్ల జ్ఞానప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. తప్పించుకుపోయిన ఖైదీలకోసం పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించి ఖైదీలు పారిపోవడానికి కారణమైన ముగ్గురు ఎస్సైలతో పాటు, ఎనిమిది మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి