Tirupathi Rao
Tirupathi Rao
బిగ్ బాస్ అంటేనే స్ట్రాటజీలకు పుట్టినిల్లు అంటారు. ఎందుకంటే అక్కడ ఏం చేసైనా చివర్లో అది నా స్ట్రాటజీ అని తప్పించుకోవచ్చు. నిజానికి బిగ్ బాస్, హోస్ట్ నాగార్జునా కూడా దానిని కాదనలేరు. తాజాగా శోభాశెట్టి జోడీ టాస్కులో అన్నీ నంబర్లను లోదుస్తుల్లో దాచుకుని అది నా స్ట్రాటజీ అంటూ చెప్పేసింది. మేము ఎలా ఆడాతాం అంటే.. అది మీ ఆట.. ఇది నా ఆట అంటూ అందరికీ షాకిచ్చింది. తన జిగిడీ దోస్త్ తేజాకి కూడా అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు. అయితే ఇవే అందరూ స్ట్రాటజీలు అనుకుని మురిసిపోతున్నారు. అయితే వీళ్లకు తెలియని.. వీళ్లు కనుక్కోలేని మాస్టర్ మైండ్స్ హౌస్ లో ఉన్నాయని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్లు మరెవరో కాదు యావర్- శుభశ్రీ.
యావర్ స్టైల్లో సుబ్బు.. నువ్వు కూడానా? అంటూ నోరెళ్లబెట్టకండి. నిజానికి యావర్ కంటే కూడా సూపర్ మైండ్ శుభశ్రీదే. ప్రిన్స్ యావర్ కు కండ ఉంటే.. సుబ్బుకు తెలివి ఉంది. ఇద్దరూ కలిసి ఎవరికీ అనుమానం రాకుండా బాగానే మేనేజ్ చేస్తున్నారు. ఉదయం మొత్తం ఇద్దరూ తలో జట్టులో ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఇద్దరూ ఒక్కటే అని ప్రేక్షకులు అయితే కనుక్కున్నారు. కానీ, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం కనుక్కోలేకపోతున్నారు. కానీ, తాజాగా జరిగిన జోడీ టాస్కులో అమర్ లాంటి వారికి క్లారిటీ వచ్చినట్లు అయింది. ‘వాడు మొత్తం దానికి ఫేవర్ చేయడానికే చేస్తున్నాడు’ అంటూ స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశాడు. అయితే అమర్ గెస్ చేసింది నిజమే. యావర్ ప్రవర్తన చూడటానికి అలాగే ఉంది.
వీళ్ల గేమ్ ప్లాన్ కి బీజం.. జోడీలు తేల్చుకోక ముందే బడింది. యావర్ మాస్టర్ ప్లాన్ వేసి సుబ్బుని గౌతమ్ కి జోడీని చేశాడు. ముందు సుబ్బు అడగ్గానే గౌతమ్ కి ఓకే చెప్పింది. కానీ, ఆలోచిస్తూనే ఉంది. తర్వాత యావర్ తో మాట్లాడుతూ.. మనం ఇద్దరం ఉందామా అని అడుగుతుంది. అందుకు యావర్ మన ఇద్దరికీ తెలుగు రాదు. ఆట అంతా కిచిడి అవుతుంది. నేను తేజాతో ఆడతాను. నువ్వు గౌతమ్ తో ఆడు అంటూ సలహా ఇస్తాడు. ఆ తర్వాత గౌతమ్ తో ఆడేందుకు రెడీ అయిపోయింది. టాస్కు పూర్తైన తర్వాత యావర్- శోభాశెట్టి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి. శోభాశెట్టి నాకు అంత క్లారిటీ లేదు నేను మొత్తం చూడలేదు అంటూ చెబుతుంది.
యావర్ అయితే దాదాపుగా చూశాను. కానీ, మొత్తం చూడలేదు అంటాడు. ఆ తర్వాత విజేతల విషయంలో పెద్ద గొడవ జరుగుతుంది. మొత్తం మూడుసార్లు విజేతలను మార్చేశారు. ప్రతిసారి టాప్ 3లో గౌతమ్- సుబ్బు ఉండేలా యావర్ మాట్లాడుతున్నాడు. అందరూ తప్పు చేశారు. కానీ, సుబ్బు- గౌతమ్ ఒకే తప్పు చేశారు.. అంటూ వాళ్లకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. అంటే యావర్ కావాలనే సుబ్బుని గెలిపించేందుకు చాలానే కష్టపడ్డాడు. ఆ విషయం క్లియర్ గానే ఉంది. అందుకే అమర్ అలాంటి కామెంట్స్ చేశాడు. ఇదంతా చూసిన తర్వాత అయినా ప్రిన్స్ యావర్– సుబ్బు గేమ్ ప్లాన్ అర్థం చేసుకుంటారో లేదో చూడాలి. మరి.. యావర్- సుబ్బు స్ట్రాటజీలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.