iDreamPost

పట్టాలెక్కిన మరో 10 వందే భారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. మరో 10 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. దేశ ప్రధాని మోడీ అహ్మదాబాద్ వేదికగా పది వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఏయే మార్గాల్లో అంటే.

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. మరో 10 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. దేశ ప్రధాని మోడీ అహ్మదాబాద్ వేదికగా పది వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఏయే మార్గాల్లో అంటే.

పట్టాలెక్కిన మరో 10 వందే భారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ

రైలు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు భారత ప్రభుత్వం వందే భారత్ రైళ్లకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వందే భారత్ ట్రైన్లు పట్టాలపై పరుగుల తీస్తున్నాయి. దేశంలోని రైలు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ప్రభుత్వం మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) మరో 10 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒకేసారి 10 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించారు. అహ్మదాబాద్ నుంచి వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు.

దేశవ్యాప్తంగా ఇప్పటికే 41 వందే భారత్ రైళ్లు వివిధ మార్గాల్లో సేవలందిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో 10 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రావడంతో ఈ సంఖ్య 51కి చేరింది. సికింద్రాబాద్ – విశాఖ‌, క‌ల‌బురగి – బెంగ‌ళూరు, ల‌క్నో – డెహ్రాడూన్, పాట్నా – ల‌క్నో, న్యూ జ‌ల్‌పాయ్ గుడి – పాట్నా, పూరి – విశాఖ‌ప‌ట్నం, రాంచీ – వార‌ణాసి, ఖ‌జుర‌హో – ఢిల్లీ, అహ్మ‌దాబాద్ – ముంబై, మైసూర్ – చెన్నై మార్గాల్లో మొత్తం 10 రైళ్ల‌ను మోడీ ప్రారంభించారు. కొత్తవలస-కోరాపుట్, కోరాపుట్-రాయగఢ్‌ లైన్లలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్‌లో కొన్ని పనులు ప్రారంభించారు ప్రధాని మోడీ. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. మొత్తం 85వేల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లు వర్చువల్‌గా ప్రారంభించారు పీఎం మోడీ.

కొత్తగా ప్రారంభించిన 10 వందే భారత్ రైళ్లు

అహ్మదాబాద్-ముంబై సెంట్రల్

సికింద్రాబాద్-విశాఖపట్నం

మైసూరు- డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై)

పాట్నా- లక్నో

న్యూ జల్పాయిగురి-పాట్నా

పూరీ-విశాఖపట్నం

లక్నో – డెహ్రాడూన్

కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు

రాంచీ-వారణాసి

ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి