iDreamPost

మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు తులం ధర ఎంతంటే?

పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు నేడు పైకి ఎగబాకాయి. పసిడితో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు నేడు పైకి ఎగబాకాయి. పసిడితో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు తులం ధర ఎంతంటే?

మనదేశంలో సీజన్ తో సంబంధం లేకుండా బంగారానికి డిమాండ్ ఉంటుంది. పసిడి ప్రియులు అంత ఇష్టంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిల్లు, శుభకార్యాలకు పసిడిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే గోల్డ్ పై పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందే వీలుంటుంది. అయితే ఇప్పుడు గోల్డ్ కొనాలనే ప్లాన్ లో ఉన్న వారికి బంగారం ధరలు షాకిస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా పైకి ఎగబాకింది గోల్డ్ రేట్. ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

నిన్న (శుక్రవారం) స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు మళ్లీ షాకిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నిన్న 22 క్యారెట్ తులం పసిడి ధర రూ. 57,750 ఉండగా నేడు రూ. 250 పెరిగి 10 గ్రామల బంగారం ధర రూ.58,000 వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్స్ స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 63 వేల వద్ద ఉండగా నేడు రూ. 230 పెరిగి 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,230 వద్ద అమ్ముడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవటం వంటి కారణాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.

gold rate today

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,380 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,550 వద్ద అమ్ముడవుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,230 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58 వేలు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,230 వద్దకు చేరింది.

భారీగా పెరిగిన వెండి ధర:

బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. నేడు సిల్వర్ ధరలు కూడా పైకి ఎగబాకాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 8700 ఉండగా.. నేడు రూ. 300 పెరిగి రూ. 81000 వద్ద ట్రేడ్ అవుతోంది. హస్తినలో కిలో వెండి ధర నిన్న రూ. 79200 ఉండగా నేడు రూ. 300పెరిగి.. రూ. 79500 వద్ద అమ్ముడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి