iDreamPost

Preity Zinta: కాలాన్ని, వయసుని గెలిచిన దేవత ప్రీతి జింటా! అసలు ఈమె డైట్ ఏంటంటే?

  • Published Apr 19, 2024 | 5:46 PMUpdated Apr 19, 2024 | 5:46 PM

సాధారణంగా 49 ఏళ్ల వయసు అంటై ముఖంపై వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ప్రీతి జింటా విషయంలో మాత్రం.. రివర్స్‌లో జరుగుతుంది. మరి కాలాన్ని, వయసును గెలిచి.. అందంగా ఉండేందుకు ఆమె ఫాలో అయ్యే డైట్‌ ఏంటి అంటే..

సాధారణంగా 49 ఏళ్ల వయసు అంటై ముఖంపై వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ప్రీతి జింటా విషయంలో మాత్రం.. రివర్స్‌లో జరుగుతుంది. మరి కాలాన్ని, వయసును గెలిచి.. అందంగా ఉండేందుకు ఆమె ఫాలో అయ్యే డైట్‌ ఏంటి అంటే..

  • Published Apr 19, 2024 | 5:46 PMUpdated Apr 19, 2024 | 5:46 PM
Preity Zinta: కాలాన్ని, వయసుని గెలిచిన దేవత ప్రీతి జింటా! అసలు ఈమె డైట్ ఏంటంటే?

సాధారణంగా వయసు పైబడుతుంటే.. అందం, శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది. పోషకాహారం తీసుకున్నా.. కఠినమైన వ్యాయమాలు చేసినా సరే.. ఓ ఏజ్‌ వచ్చాక చర్మంలో మెరుపు తగ్గుతుంది. ఆ ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. అయితే కొందరి విషయంలో మాత్రం వారి వయసు పాతికేళ్ల దగ్గరే ఆగిపోతుంది. ఏజ్‌ పైబడుతున్న కొద్ది వారి సౌందర్యం రోజు రోజుకు పెరుగుతుంది తప్ప.. ఏమాత్రం తగ్గదు. అలాంటి వారిని చూస్తే.. కొంపదీసి వీరు కూడా దేవతల మాదిరే అమృతం సేవించారా ఏంటి అనిపించక మానదు. మరీ ముఖ్యంగా కొందరు సెలబ్రిటీల విషయంలో ఇలాంటి అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. ఏజ్‌ వారికి ఓ నంబర్‌ మాత్రమే. 5 పదుల వయసులో కూడా పాతికేళ్ల పడుచులాంటి సౌందర్యం వారి సొంతం. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు బాలీవుడ్‌ హీరోయిన్‌, పంజాబ్‌ కింగ్స్‌ లెవన్‌ యజమానురాలు ప్రీతి జింటా.

అప్పుడెప్పడే 1998 లో వచ్చిన ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో ఎంత అందంగా, యవ్వనంగా కనిపించిందో.. 50 ఏళ్లకు దగ్గర పడుతున్న ఈ వేళ కూడా ఆమెలో అదే అందం. మెరిసిపోయే చర్మంతో పాటుగా చక్కని శరీర సౌష్టవాన్ని మెయిన్‌టేన్‌ చేస్తుంది ప్రీతి జింటా. పాతికేళ్ల క్రితం హీరోయిన్‌గా ఎంత అందంగా ఉందో.. ఇప్పటికి కూడా అదే బ్యూటీతో మెరిసిపోతుంది. ఇప్పుడామె వయసు 49 ఏళ్లు. ఆమెని చూసిన వారెవరూ ఆ విషయం అంగీకరించరు. మరి 5 పదుల వయసుకు దగ్గరపడుతున్న వేళ కూడా పాతికేళ్ల పడుచులా ఎలా మెరిసిపోతుంది.. ఆమె బ్యూటీ సీక్రెట్‌ ఏంటి.. ఎలాంటి డైట్‌ ఫాలో అవుతుంది వంటి వివరాలు.. మీ కోసం

నీటితో రోజు ప్రారంభం..

సెలబ్రిటీలు వారి రోజును నీటితోనే ప్రారంభిస్తారు. ప్రీతి జింటా కూడా అంతే. ఉదయం లేవగానే 15 నిమిషాల వ్యవధిలో రెండు గ్లాసుల నీరు తాగుతుంది. దాంతో పాటు బ్రిస్క్‌ వాక్‌, తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంది. సానుకూల ఆలోచనలతో తన రోజును ప్రారంభింస్తుది. ఉదయం పూట ఎండ మంచిది అంటారు. అందుకే ప్రీతి కూడా ఉదయం పూట సూర్యరశ్మి తగిలేలా యోగా, ఎక్సర్‌సైజ్‌ చేస్తుంది. గుండె ఆరోగ్యం కోసం కొన్ని సార్లు కార్డియో ఎక్సర్‌సైజులు కూడా చేస్తుంది. అలానే కొన్ని సందర్భాల్లో తన మనసుకు నచ్చిన పాటలు పెట్టుకుని.. డ్యాన్స్‌ చేస్తుంది.

6-7 సార్లు భోజనం..

బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి వ్యాయమాలు ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా ఉండటం కోసం పోషకాహారం కూడా అంతే ముఖ్యం. ప్రీతి ఫాలో అయ్యే డైట్‌ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా.. రోజులో 6-7 సార్లు.. చిన్న మొత్తంలో ఆహారం తీసుకుంటుంది. ఇక ఆమె భోజనంలో జంక్‌ ఫుడ్‌, క్రాబ్స్‌ పూర్తిగా నిషేధం. పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, ఇంట్లో తయారు చేసిన తాజా మామిడి, పొప్పడి పండు జ్యూస్‌లు ఆహారంలో కచ్చితంగా ఉండాల్సిందే. అలానే నట్స్‌తో చేసిన బటర్‌ కూడా ఆమె డైట్‌లో భాగం. ఇ‍క శరీరాన్ని తేమగా ఉంచుకోవడానికి నీరు, ఫ్రెష్‌ జ్యూస్‌లు ఎక్కువ తీసుకుంటుంది. కడుపు నిండుగా కాకుండా మనసు నిండుగా తినడం అనే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతుంది ప్రీతి. తినే ఆహారం మీద శ్రద్ధ పెట్టి.. ఎంతో ఇష్టంగా భోజనం చేస్తుంది.

7 గంటలు నిద్ర..

ఇక ఆరోగ్యంగా ఉండాలంటే.. వ్యాయామం, మంచి ఆహారంతో పాటు ప్రశాంతమైన మైండ్‌ సెట్‌ కూడా ముఖ్యం. అందుకే ప్రీతి డైట్‌, వ్యాయమాలతో పాటు కచ్చితంగా ప్రతి రోజు 7 గంటల పాటు నిద్ర పోతుంది. సంతోషం అనేది మంచి ఆరోగ్యానికి మూల సూత్రం అని నమ్ముతుంది. సాధ్యమైనంత వరకు ఆందోళనకు దూరంగా.. ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నిస్తుంది. వీటన్నింటిని కచ్చితంగా ఫాలో అవుతుంది కాబట్టే.. 49 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల పడుచులా ఎంతో అందంగా, యవ్వనంగా కనిపిస్తుంది ప్రీతి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి